- వైద్య సిబ్బందికి కలెక్టరు అరుణ్‌కుమార్ హెచ్చరిక
బాధ్యత లేకుండా పనిచేస్తే చర్యలు
Published Sun, Apr 16 2017 12:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కోరుకొండ (రాజానగరం) :
జిల్లాలోని కొన్ని ప్రభుత్వాస్పత్రులలో వైద్య సిబ్బంది బాధ్యత రహితంగా పనిచేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తప్పవని కలెక్టరు హెచ్.అరుణ్‌కుమార్ హెచ్చరించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రి అవరణలో శనివారం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 128 ప్రభుత్వాస్పత్రులలో 40 పీహెచ్‌సీలలో సిబ్బంది సక్రమంగా బాధ్యతలు చేపట్టడం లేదని, కొన్నింటిలో ఓపీ సక్రమంగా ఉండడం లేదన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని స్పష్టంచేశారు. ఏఎ¯ŒSఎంలు, అంగ¯ŒSవాడీ టీచర్లు పనిచేసే చోటే మకాం ఉండాలన్నారు. జిల్లాలోని 128 మంది పీహెచ్‌సీల్లో 18 పీహెచ్‌సీలలో సిజేరిన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో రాజమహేంద్రవరం డివిజ¯ŒS జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచిందని అన్నారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ ఎ¯ŒS.విజయ్‌కృష్ణ¯ŒS మాట్లాడుతూ ఆస్పత్రి, పాఠశాలల వద్ద మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలన్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ ఆదివారం కూడా ఆస్పత్రులలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు డాక్టర్, సిబ్బంది ఉండేలా చూడాలని సూచించారు.
తొలుత హెచ్‌పీసీఎల్ సంస్థ నిర్మించిన టాయ్‌లెట్ భవన సముదాయాన్ని, కోరుకొండ, రాజానగరం, సీతానగరం, గోకవరం మండలాలకు స్వచ్ఛభారత్‌లో చెత్త తరలింపు రిక్షాలను కలెక్టర్ ప్రారంభించారు. ఆస్పత్రుల్లో మొక్కలను నాటి న్యూట్రీ గార్డె¯ŒS ఏర్పాటుకు విత్తనాలు జల్లారు. ఆస్పత్రులలో గర్భిణులకు సిజరీ¯ŒS చేసే సముదాయాన్ని ప్రారంభించారు. హెచ్‌పీసీఎల్ సీనియర్ మేనేజర్ దామోదర్, డీఎంహెచ్‌ఓ ఎం, చంద్రయ్య, రాజమహేంద్రవరం మార్కెట్ యార్డు చైర్మ¯ŒS తనకాల నాగేశ్వరరావు, కోరుకొండ పీహెచ్‌సీ అభివృధ్ధి కమిటీ చైర్మ¯ŒS మాతా సీతారాముడు, ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement