సైనిక దాడి తగ్గిస్తామని మాటిచ్చి మరీ.. ఉక్రెయిన్‌లో దాడుల్ని రష్యా తీవ్రతరం చేసింది. కీవ్ నలుమూలల నగరాల్లో దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో.. క్రెమ్లిన్‌ను సొంత సైన్యమే తప్పుదోవ పట్టిస్తోందన్న భావనలోకి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూరుకుపోతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సొంత సైన్యంపైనే గుర్రుగా ఉన్నాడంటూ అమెరికా అంటోంది. ఈ మేరకు బుధవారం అమెరికా ఇంటెలిజెన్సీ కార్యదర్శి, వైట్‌హౌజ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్‌ఫీల్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆయన(పుతిన్) సైన్యం తనను తప్పుదోవ పట్టిస్తోందన్న భావనకు వచ్చేశారు. సైన్యాధికారుల్ని ఆయన నమ్మడం లేదు. రష్యా మిలిటరీ వర్గాలు-పుతిన్ మధ్య మధ్య నిరంతర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ మిలిటరీ చర్యల్లో తనను తప్పుదారి పట్టించినందుకు పుతిన్ కోపంగా ఉన్నార’’ని బెడింగ్‌ఫీల్డ్ పేర్కొన్నారు.
యుద్ధం మొదలై నెల గడుస్తోంది. అయినా ఉక్రెయిన్ లొంగిపోలేదు. యుద్ధ పరిణామాలను తనకు సైన్యం సరిగ్గా వివరించడం లేదని, సరైన దిశానిర్దేశం లేకుండా ముందుకు వెళ్తున్నాయంటూ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కారు పుతిన్. అయితే పుతిన్‌కు భయపడే సైన్యం అసలు వాస్తవాలు వెల్లడించడం లేదన్న వాదనా వినిపిస్తోంది. ఇక అమెరికా-ఈయూ దేశాల ఆయుధ సంపత్తితో రష్యాకు చెందిన యుద్ధ ట్యాంకర్లను, ఎయిర్‌క్రాఫ్ట్‌లను నాశనం చేస్తున్నాయి. మరోవైపు రష్యా సైన్య సిబ్బంది భారీగా మరణిస్తున్నారు. ఇంకోవైపు యుద్ధ భూమిలోనే కాకుండా.. ఆంక్షలతో మాస్కోను ముప్పుతిప్పలు పెడుతున్నాయి పాశ్చాత్య దేశాలు. ఈ పరిణామాలేవీ పుతిన్‌కు సహించడం లేదని, ఆ అసహనాన్ని సైన్యం వద్ద చూపిస్తున్నాడంటూ కీవ్ వర్గాలు సైతం కథనాలు వెలువరుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment