ఆందోళన చేస్తున్న రెవెన్యూ సంఘం నాయకులు
జగిత్యాల: నర్సంపేట జిల్లాలో ఎమ్మెల్యే మాధవరెడ్డి కలెక్టర్లు మస్కూరుల కంటే అధ్వానంగా పనిచేస్తున్నారని ఎద్దేవ చేస్తూ మాట్లాడడాన్ని నిరసిస్తూ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ కలెక్టర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్లపైనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం గౌరవ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్, ఎండీ.వకీల్, టీఎన్జీవోల అధ్యక్షుడు శశిధర్, కృష్ణ, మధుగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment