బ్యాంకులోకి దూసుకుపోతున్న రైతులు
రైతుల కన్నెర్ర
Published Fri, Dec 16 2016 9:58 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– ఏడీబీ బ్యాంకు బారికేడ్లు ద్వంసం
ఎమ్మిగనూరురూరల్: స్థానిక ఎస్‌బీఐ(ఏడీబీ) దగ్గర శుక్రవారం సాయంత్రం రైతులు అందోళనకు దిగారు. బ్యాంకులో డబ్బులు అయిపోయాయి ఉదయం రావాలని బ్యాంకు అధికారులు చెప్పటంతో ఉదయం నుంచి సహనంతో ఉన్న రైతులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. అందోళనగా వైఎస్‌ఆర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసమూర్తి, పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌లు అక్కడి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఉదయం నుంచి రూ. 2 వేలు ఇస్తున్నారు, ఇప్పుడు అది కూడ లేదంటే మేము ఎక్కడికి వెళ్లాలని చెప్పారు. మేము ఇప్పిస్తామని చెప్పటంతో అందోళన విరమించి బ్యాంకు దగ్గరకు పరుగులు తీశారు. బ్యాంక్ మేనేజర్‌తో సీఐ,ఎస్‌ఐలు మాట్లాడటంతో డబ్బులు అయిపోయాయని వారికి చెప్పటంతో ఎస్‌బీఐ మేనేజర్ ప్రసాద్‌తో మాట్లాడి బ్యాంకు బయట ఉన్నవారి కోసం రూ. 5 లక్షలు ఏడీబీకి ఇప్పించారు. ఎస్‌ఐ హరిప్రసాద్ దగ్గరుండి ఒక్కొక్కరకి రూ. 2 వేలు చొప్పున రైతులందరికి ఇప్పించారు. పూర్తి స్థాయిలో డబ్బులు వస్తే ఈ సమస్య ఉండదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
Advertisement