ADB Bank
-
రూ.2 వేలకోట్ల ఆర్థిక సహాయానికి ఏడీబీ ఆమోదం
సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్రానికి 240.5 మిలియన్ డాలర్ల(సుమారు రూ.2 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఏడీబీ ప్రిన్సిపల్ ఎనర్జీ స్పెషలిస్ట్ కౌరు ఒగినో మాట్లాడుతూ..‘ఏడీబీకు చెందిన మల్టీ ట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ.. సోలార్ రూఫ్‌టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ 2, 3 దశలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశం 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఏడీబీ ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రజలను ప్రోత్సహించేలా ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది’ అని తెలిపారు.ఇదీ చదవండి: తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లో ప్రకటించారు. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రాయితీపై రుణాలు పొందే వీలు కల్పిస్తున్నారు. -
మరింత వేగంగా వీసీఐసీ అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధి మరింత వేగం కానుంది. ఈ కారిడార్‌లో ఇప్పటికే తొలి దశ కింద రూ.2,900 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇప్పుడు రెండో దశ అభివృద్ధికి మార్గం సుగమమైంది. తొలి దశ అంచనా వ్యయంలో కొంత భాగం రుణంగా సమకూర్చిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) రెండో దశకు కూడా రుణం రూపంలో నిధులు సమకూర్చడానికి అంగీకరించింది. రెండో దశకు రూ. 1,632.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా అందులో రూ.1130 కోట్లు (141.12 మిలియన్ డాలర్లు) ఏడీబీ రుణంగా అందించనుంది. ఈ రుణంపై సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతి కోరుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ (డీఈఏ)తో పాటు రాష్ట్ర అధికారులకు ఏడీబీ కంట్రీ డైరెక్టర్ టకియో కొనిషి లేఖ రాశారు. రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్, రాంబల్లి, నక్కపల్లి క్లస్టర్స్‌లో స్టార్టప్ ఏరియాకు సంబంధించి ఏడు ప్రాజెక్టులను చేపడతారు. కేంద్రం నుంచి అనుమతిరాగానే ఈ పనులు ప్రారంభిస్తామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 23,046 ఎకరాలు అభివృద్ధి వీసీఐసీ రెండో దశలో చిత్తూరు సౌత్ క్లస్టర్లో రూ.462.96 కోట్లతో 2,770 ఎకరాలు, నక్కపల్లి క్లస్టర్లో రూ.399.03 కోట్లతో 1,120 ఎకరాలు, రాంబల్లిలో రూ.149 కోట్లతో 396 ఎకరాలు అభివృద్ధి చేస్తారు. ఈ మూడు క్లస్టర్లను సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. ఇందులో భాగంగా అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డును రూ.243.02 కోట్లతో జాతీయ రహదారికి అనుసంధానిస్తారు. అదే విధంగా నాయుడుపేట క్లస్టర్‌ను రూ 120.78 కోట్లతో, రౌతు సురమాల క్లస్టర్‌ను రూ.67.42 కోట్లతో, నక్కపల్లి క్లస్టర్‌ను రూ.25.91 కోట్లతో ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రూ.164.70 కోట్లు భూ సేకరణకు ఖర్చవుతుంది. మిగిలిన మొత్తంతో ఈ ఏడు ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో మొత్తం 4,143.92 ఎకరాలను అభివృద్ధి చేస్తుండగా ఇప్పటికే 3,399.43 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇంకా 744.49 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ రెండు దశలు పూర్తయితే పారిశ్రామిక అవసరాల కోసం 23,046 ఎకరాలు అందుబాటులోకి వస్తాయి. (చదవండి: థాంక్యూ సీఎం సార్ ! సీఎం జగన్ చిత్రపటానికి డీఎస్సీ 1998 ఉద్యోగుల క్షీరాభిషేకం ) -
రైతుల కన్నెర్ర
– ఏడీబీ బ్యాంకు బారికేడ్లు ద్వంసం ఎమ్మిగనూరురూరల్: స్థానిక ఎస్బీఐ(ఏడీబీ) దగ్గర శుక్రవారం సాయంత్రం రైతులు అందోళనకు దిగారు. బ్యాంకులో డబ్బులు అయిపోయాయి ఉదయం రావాలని బ్యాంకు అధికారులు చెప్పటంతో ఉదయం నుంచి సహనంతో ఉన్న రైతులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను ధ్వంసం చేశారు. అందోళనగా వైఎస్ఆర్ సర్కిల్ దగ్గరకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసమూర్తి, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్‌లు అక్కడి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఉదయం నుంచి రూ. 2 వేలు ఇస్తున్నారు, ఇప్పుడు అది కూడ లేదంటే మేము ఎక్కడికి వెళ్లాలని చెప్పారు. మేము ఇప్పిస్తామని చెప్పటంతో అందోళన విరమించి బ్యాంకు దగ్గరకు పరుగులు తీశారు. బ్యాంక్ మేనేజర్‌తో సీఐ,ఎస్ఐలు మాట్లాడటంతో డబ్బులు అయిపోయాయని వారికి చెప్పటంతో ఎస్బీఐ మేనేజర్ ప్రసాద్‌తో మాట్లాడి బ్యాంకు బయట ఉన్నవారి కోసం రూ. 5 లక్షలు ఏడీబీకి ఇప్పించారు. ఎస్ఐ హరిప్రసాద్ దగ్గరుండి ఒక్కొక్కరకి రూ. 2 వేలు చొప్పున రైతులందరికి ఇప్పించారు. పూర్తి స్థాయిలో డబ్బులు వస్తే ఈ సమస్య ఉండదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. -
భారత్ కు మూడేళ్లలో 10-12 బిలియన్ డాలర్లు: ఏడీబీ
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం భారత్‌కు చేయూతనందిస్తామని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) పేర్కొంది. అందులో భాగంగానే ఇండియాకు ఇచ్చే నిధులను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే మూడేళ్ల కాలంలో (2016-18) 10-12 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయమందిస్తామని వెల్లడించింది. ఏడీబీ ప్రెసిడెంట్ తకిహికొ నకయో శుక్రవారం ఆర్థిక మంత్రి జైట్లీని కలిశారు. అంతర్జాతీయంగా వృద్ధి మందగించడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో సంక్షోభ పరిస్థితులు, కమోడిటీ ధరలు నేలకు దిగిరావడం వంటి ప్రతికూల అంశాల్లోనూ భారత్ మంచి వృద్ధిని నమోదు చేస్తోందని కితాబునిచ్చారు. కేంద్ర ప్రభుత్వపు చర్యల కారణంగా ప్రపంచంలోనే ఇండియా ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా అవతరిస్తుందని అంచనా వేశారు. తాజా బడ్జెట్ కూడా వృద్ధికి దోహదపడేలా ఉందన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 7 శాతంపైగా ఉంటుందని ఏడీబీ అంచనా వేసింది.