సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం అందించేందుకు ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) ఆమోదం తెలిపింది. ఈమేరకు కేంద్రానికి 240.5 మిలియన్ డాలర్ల(సుమారు రూ.2 వేల కోట్లు) రుణం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా ఏడీబీ ప్రిన్సిపల్ ఎనర్జీ స్పెషలిస్ట్ కౌరు ఒగినో మాట్లాడుతూ..‘ఏడీబీకు చెందిన మల్టీ ట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ.. సోలార్ రూఫ్‌టాప్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రోగ్రామ్ 2, 3 దశలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశం 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఏడీబీ ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రజలను ప్రోత్సహించేలా ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం ఎంతో ఉపయోగపడుతుంది’ అని తెలిపారు.
ఇదీ చదవండి: తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఫిబ్రవరిలో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించారు. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో.. ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రాయితీపై రుణాలు పొందే వీలు కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment