
...తమన్నాను ట్విట్టర్‌లో ప్రశ్నించాడో నెటిజన్. ప్రేమాభిమానాలు, పొగడ్తలతో పాటు అప్పుడప్పుడూ తిట్లు, ఛీత్కారాలూ వస్తుంటాయి ట్విట్టర్ వంటి సోషల్ మీడియా పోర్టల్స్‌లో! కొందరు నెటిజన్ల పట్ల ఘాటుగా స్పందిస్తారు. మరికొందరు కూల్‌గా జవాబిస్తారు. తమన్నా రెండో కేటగిరిలోకి వస్తారు. ‘తెల్లగా ఉన్నావని పొగరా? నాకు రిప్లై ఇవ్వడం లేదు?’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తికి కూల్‌గా రిప్లై ఇచ్చారు.
‘అయ్యో... పొగరు కాదండి. మీకు నా నమస్కారాలు. జీవితంలో మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అన్నారు తమన్నా. మొన్నీ మధ్య ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో కాసేపు సరదాగా చాట్ చేశారీ బ్యూటీ. ఆమెకు డ్రీమ్ రోల్ ఏదో కూడా చెప్పారు. ‘‘సిన్మాలు లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేను. డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే సిన్మాలో నటించాలనేది నా డ్రీమ్’’ అని పేర్కొన్నారు తమన్నా.