లక్నో: ఉత్తరప్రదేశ్ నోయిడాలో దారుణం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన తన భార్యను భర్తే హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని బాత్‌రూంలో దాచి, తాను ఇంటి స్టోర్‌రూమ్‌లో తలదాచుకున్నాడు. బాధితురాలి సోదురుడు ఫోన్ చేసినప్పటికీ కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రేణు సిన్హా(61), అజయ్ నాథ్‌లు భార్యభర్తలు. అజయ్ నాథ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మాజీ ఉద్యోగి. రేణు సిన్హ సుప్రీంకోర్టు లాయర్‌గా పనిచేశారు. వారు నోయిడాలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అయితే.. ఆ ఇంటిని అజయ్ నాథ్ రూ.4 కోట్లకు అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. అడ్వాన్స్ కూడా కొనుగోలుదారుని వద్ద తీసుకున్నాడు. కానీ బంగ్లా అమ్మడానికి రేణు సిన్హా అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అజయ్ నాథ్.. రేణు సిన్హాను హత్య చేశాడు.
అనంతరం ఇంటికి తాళం వేసి స్టోర్ రూమ్‌లో తలదాచుకున్నాడు. రేణు సిన్హా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆమె సోదరుడు అనుమానంతో ఇంటికి వచ్చి చూశాడు. అటు అజయ్ నాథ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి ఇంటికి వచ్చిన పోలీసులు.. బాత్‌రూంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. అన్ని రూంలలో చెక్ చేయగా.. స్టోర్ రూంలో నిందితున్ని పట్టుకున్నారు.
నిందితున్ని ప్రశ్నించగా.. హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితున్ని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రేణు సిన్హ ఇటీవలే క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు ఆమె సోదరుడు తెలిపారు. రేణు సిన్హ, అజయ్ నాథ్‌ల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించాడు.
ఇదీ చదవండి: లేడీ అనురాధ డ్రగ్స్ దందా
Comments
Please login to add a commentAdd a comment