
ప్రతీకాత్మక చిత్రం
కరీంనగర్: ఓ కేసు విషయమై న్యాయస్థానంలో వాదించేందుకు వచ్చిన రాజస్థాన్ న్యాయవాది మృతి చెందారు. కరీంనగర్ జిల్లా రాజీవ్ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన న్యాయవాది రాజేశ్ కుమార్ (45) ఓ కేసు విషయమై వాదించేందుకు కరీంనగర్‌కు బయల్దేరారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండయిన లాయర్ రాజేశ్ అక్కడి నుంచి ట్యాక్సీలో కరీంనగర్ బయల్దేరారు.
మార్గమధ్యలో రేణికుంటకు చేరుకోగానే అతివేగంతో వెళ్తున్న ట్యాక్సీ అదుపు తప్పి స్టేషనరీ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన న్యాయవాది రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాక్సీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని, డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment