
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణ సాగర్ సాక్షితో మాట్లాడారు. రాజాసింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేయాలంటూ వాదనలు వినిపించామని తెలిపారు. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఒక ప్రజా ప్రతినిధిని అరెస్టు చేయాలంటే 41 సీఆర్‌పీసీ నోటీసులు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే రాజాసింగ్‌కు నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు.
తమ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ మంజూరు చేసిందని కరుణ సాగర్ చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మరోసారి వ్యాఖ్యలు చేయవద్దంటూ న్యాయస్థానం ఎమ్మెల్యేకు సూచించిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆరోపణలు వస్తున్న వీడియోకు సంబంధించి న్యాయస్థానంలో ఎలాంటి వాదనలు జరగలేదని స్పష్టం చేశారు. రాజాసింగ్ మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇప్పటివరకు పోలీసులు కోర్టుకు సమర్పించలేదని తెలిపారు. కేవలం రాజసింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేయాలని తమ వాదనలు వినిపించామని, 20 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు కీలకతీర్పు వెల్లడించిందన్నారు.
చదవండి: BJP MLA Raja Singh: రాజాసింగ్‌కు రిమాండ్ వ్యవహారంలో ట్విస్టు!
Comments
Please login to add a commentAdd a comment