
సాక్షి, హైదరాబాద్: ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ జైలు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, చార్మినార్ వెళ్లే దారులతో పాటు చంచల్‌గూడ జైలు పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే రాజాసింగ్‌పైపై 12 కేసులు నమోదవడం గమనార్హం. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది.
చదవండి: Raja Singh Suspension: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా..
అంతకముందు నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజాసింగ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా కోర్టు వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు కోర్టు బయట ఎంఐఎం పార్టీ అనుచరులు కూడా ఆందోళన చేపట్టారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. రాజాసింగ్‌కు అనుకూల, వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ.. కోర్టు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment