
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రిమాండ్ వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. రాజాసింగ్ రిమాండ్‌ను రిజెక్ట్ చేసిన నాంపల్లి కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు.
41 సీఆర్పీసీపై 45 నిమిషాలపాటు ఇరువర్గాలు వాదనలు కొనసాగించాయి. రాజాసింగ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పోలీసులు అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించనందుకు రాజాసింగ్ రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్ చేసింది. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన బీజేపీ హైకమాండ్.. పది రోజుల్లోగా..
చదవండి: రాజీ’ ఎరుగని రాజా సింగ్.. దేశవ్యాప్తంగా కేసులే కేసులు
Comments
Please login to add a commentAdd a comment