సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం చెల్లింపులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మార్చి నుంచి జూన్ వరకు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ప్రతినెలా రూ.5,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రాక్టీస్ పిరియడ్‌లో మూడేళ్ల పాటు అందించనున్నారు. వృత్తిలో నిలదొక్కుకునే వరకు జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకానికి శ్రీకారం చుట్టారు. (‘సీఎం జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు’)
Comments
Please login to add a commentAdd a comment