YSR Law Nestham
-
పేదల పక్షాన నిలవండి
సాక్షి, అమరావతి: పేదల పక్షాన అడ్వొకేట్ సోదరులు, చెల్లెమ్మలు ఔదార్యం చూపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్‌ను ఇదే కోరుతున్నానని, దీనిని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ విడుదల చేశారు. నెలకు రూ.5,000 చొప్పున 2023 జూలై–డిసెంబర్ వరకు 6 నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.30,000 మేరకు మొత్తం రూ.7,98,95,000 కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, అదే రీతిన మీరంతా పేద వాడి పక్షాన నిలవాలన్నారు. వారి పట్ల మానవతా దృక్పథం చూపించాలని కోరారు. లా డిగ్రీ పూర్తి చేసుకుని, న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకునే సమయంలో వారికి ప్రోత్సాహకంగా నిలుస్తూ వరుసగా గత నాలుగేళ్లుగా వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. నెలకు రూ.5 వేలు స్టైఫండ్ చొప్పున, సంవత్సరానికి రూ.60 వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఇస్తున్నామన్నారు. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఈ కార్యక్రమం ద్వారా తోడుగా నిలిచామని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్లకు మంచి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లలో రూ.49.51 కోట్లు ► ‘ఈ నాలుగేళ్లలో వైఎస్సార్ లా నేస్తం ద్వారా మొత్తంగా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి చేస్తూ.. మనందరి ప్రభుత్వం రూ.49.51 కోట్లు సాయం చేసింది. ఈ మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి ఈ కార్యక్రమం ముందడుగు అవుతుంది. అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వైఎస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరినీ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచాం. ► ఈ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వీళ్లలో 643 కుటుంబాలకు రూ.52 లక్షలు ఇచ్చాం. ఆ సమయంలో ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ మరో 7,733 మందికి రూ.11.56 కోట్ల రుణాలు ఇచ్చారు. మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద మరో రూ.11.41 కోట్లు చెల్లించాం. అదే టైంలో దాదాపు రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి అడ్వొకేట్ కమ్యూనిటీకి ఇచ్చి, వారికి తోడుగా నిలబడగలిగాం. ► నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను. ఆ మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాలుగా అడుగులు ముందుకు వేశాం. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం అన్నారు. ► ఈ కార్య‘క్రమంలో సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, లా సెక్రటరీ జి సత్యప్రభాకర రావు, ఇతర అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. విజనరీ స్కీమ్స్ మీకే సాధ్యం గుంటూరు జిల్లా కోర్టులో నేను జూనియర్ అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. మీరు ప్రవేశపెట్టిన విజనరీ స్కీమ్స్ గురించి సచివాలయంలో తెలుసుకున్నాను. హ్యాట్సాఫ్ సార్. నేను ఇటీవల ఆరోగ్య సురక్ష క్యాంప్‌కు వెళ్లాను. చాలా బాగుంది. దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. విదేశీ విద్య చాలా బాగుంది. తుపాను సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, భరోసా చాలా నచ్చింది. మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని మేం కూడా పేదలకు సాయం చేయాలనుకుంటున్నాం. మీరు ఒక విజనరీ. మీరు ఇచ్చే స్టైఫండ్ చాలా ఉపయోగపడుతుంది. మా కాళ్లపై మేం నిలబడుతున్నాం. – శశిధర్, జూనియర్ అడ్వొకేట్, గుంటూరు లా నేస్తం మాకు ధైర్యాన్నిచ్చింది నేను వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాను. నాకు చాలా ఉపయోగపడుతోంది. మేం ఈ డబ్బును కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు, బుక్స్, రవాణా ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాం. ఈ వృత్తిలో తొలుత ఎలా నిలదొక్కుకోవాలి.. ఎలా రాణించాలి.. ఖర్చుల మాటేంటి.. అని భయపడ్డాం. కానీ ఈ స్కీమ్ మాకు ధైర్యాన్నిచ్చింది. మా జూనియర్స్‌కు కూడా ధైర్యం చెబుతున్నాం. గుప్తుల స్వర్ణయుగాన్ని నేను చూడలేదు కానీ మీ పాలనలో చూడగలిగాను. చాలా సంతోషం. మీరు ఇచ్చే అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. మా నాన్న ఆర్టీసీ ఉద్యోగి. ఆరీ్టసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో చాలా సంతోషపడ్డాం. – కోట ఆశ్రిత, జూనియర్ అడ్వొకేట్, నందిగామ -
యువ లాయర్ మాటలకు సీఎం జగన్ ఫిదా
-
ఫ్యూచర్ ని ముందే ఆలోచించి ఇలాంటి పథకాలు ఎలా పెట్టారు అన్న
-
వైఎస్ఆర్ లా నేస్తం రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది: సీఎం జగన్
-
నాలుగేళ్లుగా ప్రభుత్వం అండగా ఉంటోంది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇదని, ఇవాళ 2,807 మంది న్యాయవాదులకు మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం బటన్ నొక్కి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఇప్పటివరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందన్నారు. నాలుగున్నరేళ్లలో రూ.49.51 కోట్లు అందించాం. రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. పేదవాడి తరపున న్యాయవాదులంతా ఔదార్యం చూపించాలి. కోవిడ్ సమయంలోనూ యువ లాయర్లకు ప్రభుత్వం అండగా నిలబడింది. నాలుగేళ్లుగా యువ లాయర్లకు అండగా ఉంటున్నాం. పేదలకు యువ లాయర్లు న్యాయం చేయాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ♦ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం ♦వరుసగా నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్ లా నేస్తం అనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తున్నాం ♦లా పూర్తి చేసుకొని తమ వృత్తిలో తాము నిలబడేందుకు, ఆ నిలబడే సమయంలో వారికి ప్రోత్సాహకంగా ఉండేందుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత మూడేళ్లపాటు సంవత్సరానికి రూ.60 వేలు అంటే నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్లకు రూ.లక్షా 80 వేలు ఇస్తున్నాం ♦వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా వారికి తోడుగా ఉంటున్నాం ♦మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఈరోజు మంచి జరిగిస్తూ దాదాపు 8 కోట్లు బటన్ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం ♦నాలుగేళ్లలో మొత్తంగా వైయస్సార్ లా నేస్తం ద్వారా 6,069 మంది జూనియర్ అడ్వొకేట్లకు మంచి జరిగిస్తూ మనందరి ప్రభుత్వం ఖర్చు చేసిన అమౌంట్ రూ.49.51 కోట్లు ♦ఇటువంటి అడ్వొకేట్లకు వాళ్ల ఇనీషియల్ స్టేజ్‌లో నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం మంచి చేస్తూ అడుగులు ముందుకేస్తోంది ♦ఈ కార్యక్రమం ద్వారా వాళ్ల ప్రొఫెషన్లో వాళ్లు నిలదొక్కుకోవడం, తర్వాత ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం మంచి ముందడుగు అవుతుంది ♦అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వాళ్ల కోసం వైయస్సార్ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్టును స్థాపించాం ♦అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరూ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచుతూ రూ.100 కోట్లు కేటాయింపు చేశాం ♦ఆ కేటాయింపు వల్ల కోవిడ్ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం తరఫున వేగంగా అడుగులు పడ్డాయి. ♦643 మందికి కోవిడ్ సమయంలో వీళ్ల కుటుంబాలకు రూ.52 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది ♦ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ 7,733 మందికి రూ.11.56 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది ♦మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ కింద రూ.11.41 కోట్లు చెల్లించడం జరిగింది ♦రూ.25 కోట్లు ఈ ఫండ్ నుంచి ఇచ్చి అడ్వొకేట్ కమ్యూనిటీకి తోడుగా నిలబడగలిగింది. ♦ఇవన్నీ మనసు పెట్టి, మంచి జరగాలని మనసారా ఆలోచన చేసి చేయగలిగాం ♦నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను ♦మాట ఇచ్చిన మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ అడుగులు వేయడం, ఈ నాలుగు సంవత్సరాలుగా చేయగలిగాం అని సంతోషంగా చెబుతున్నా ♦ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్కు నా తరఫున ఒకే ఒక రిక్వెస్ట్ ♦ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, పేద వాడి పక్షాన మీరు కూడా అంతే ఔదార్యం చూపిస్తూ, మంచి చేసే విషయంలో మానవతా దృక్ఫథం చూపించాల్సిందిగా ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున మీ అన్నగా, మీ అందరికీ మంచి స్నేహితుడిగా అభ్యర్థిస్తున్నా ♦దేవుడి దయతో మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం -
యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం
-
యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరునెలలకు ఒక్కొక్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తోంది. నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ.25 కోట్ల ఆర్థికసాయం అందించింది. ఈ ట్రస్ట్ నుంచి ఆర్థికసాయం కోరే అడ్వకేట్స్ ఆన్లైన్లో ట్ఛఛిచి ్చఠీః్చp.జౌఠి.జీnలోగానీ, నేరుగా లా సెక్రటరీకిగానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా 1902 టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు. ఈ పథకాన్ని మరింత సమర్థంగా మానిటర్ చేస్తూ యువ న్యాయవాదులు ఏకకాలంలో పెద్దమొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునే విధంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం వారి ఖాతాల్లో నిధులు జమచేస్తోంది. దరఖాస్తు చేసుకోదలిచినవారు https://ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో తమ పేరు, బ్యాంకు అకౌంట్, ఆధార్ నంబరు, సర్టిఫికెట్లు జతచేయాలి. -
రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులు విడుదల
సాక్షి, అమరావతి: వైఎస్సార్ లా నేస్తం నిధులు రేపు(సోమవారం) విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు విడుదల చేయనున్నారు. 2,807 మంది యువ న్యాయవాదులకు రూ.7 కోట్ల 98 లక్షలను వారు ఖాతాలోకి సీఎం జమ చేయనున్నారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ వైఎస్సార్సీపీ అందిస్తుంది. రేపు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో అందించిన మొత్తం ఆర్థిక సాయం రూ. 49.51 కోట్లు. న్యాయ వాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో "అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్"ను ఏర్పాటు చేసి, న్యాయవాదుల అవసరాలకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే రూ. 25 కోట్ల ఆర్థిక సాయం జగనన్న ప్రభుత్వం అందించింది. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
యువ న్యాయవాదులకు అండగా వైఎస్ఆర్ లా నేస్తం
-
జూనియర్ లాయర్ల నుంచి పేదల పట్ల మమకారాన్ని ఆశిస్తున్నానని చెప్పిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
న్యాయ సాయం అందించడంలో.. పేదలకు మీరే నేస్తం: సీఎం జగన్
జూనియర్ లాయర్లు న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డాక పేదల పట్ల ఇదే రీతిలో మమకారం చూపాలి. ప్రభుత్వం తరఫున ఒక అన్నగా, స్నేహితుడిగా మీ నుంచి నేను ఆశించేది అదే. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: యువ న్యాయవాదులకు అండగా నిలుస్తూ ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ లా నేస్తం’ లాంటి పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. యువ న్యాయవాదులు వృత్తిలో ప్రవేశించిన తొలి మూడేళ్ల పాటు ఆర్థికంగా ఊతమిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు. నాలుగేళ్లుగా లా నేస్తం పథకాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు 5,781 మందికి మొత్తం రూ.41.52 కోట్లు అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి – జూన్ వరకు మొదటి విడత వైఎస్సార్ లా నేస్తం సాయం కింద 2,677 మంది జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.ఐదు వేలు స్టైఫండ్ చొప్పున రూ.25,000 అందచేస్తూ మొత్తం రూ.6,12,65,000ని ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, లా సెక్రటరీ జి.ప్రభాకర్, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వృత్తిలో నిలదొక్కుకునేలా.. న్యాయవాదులు లా కోర్సు పూర్తి చేసిన మొదటి మూడేళ్లు ప్రాక్టీస్పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే చదువులు పూర్తై కోర్టుల్లో అడుగుపెడుతున్న తరుణంలో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా తోడుగా నిలిచి నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రూ.60 వేలు ఇస్తున్నాం. మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.80 లక్షలు అందిస్తున్నాం. దీనివల్ల వృత్తిలో ఇబ్బంది పడకుండా నిలదొక్కుకుని ముందుకు వెళ్తారన్న ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించాం. ఇది ఒక మంచి ఆలోచన, మంచి కార్యక్రమం. రూ.వంద కోట్లతో వెల్ఫేర్ ట్రస్ట్.. ఇలాంటి ఆలోచన, ఇలాంటి పథకం కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమలు జరుగుతోంది. ఇదొక్కటే కాకుండా అడ్వొకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. మెడిక్లెయిమ్, న్యాయవాదుల అవసరాలకు రుణాలు లాంటి వాటికి ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేశాం. ఈ రెండు కార్యక్రమాల ద్వారా అడ్వొకేట్లకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉందనే సంకేతం వెళ్లింది. ఇంకా బాగా ఉపయోగపడాలని.. ఇంత మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నేను న్యాయవాదులను కోరేది ఒక్కటే. జూనియర్ న్యాయవాదులకు ఈ పథకం ద్వారా మంచి జరిగితే వారు వృత్తిలో స్థిరపడ్డాక ఇదే మమకారాన్ని పేదల పట్ల చూపిస్తారని విశ్వసిస్తున్నా. ఒక అన్నగా, స్నేహితుడిగా వారి దగ్గరనుంచి నేను ఆశిస్తున్నది ఇదే. దేవుడి దయ వల్ల మంచి జరుగుతోంది. దీన్ని ఎప్పుడూ మరచిపోవద్దని కోరుతున్నా. ఈ మంచిని ప్రతి పేదవాడికి తిరిగి బదిలీ అయ్యేలా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. వైఎస్సార్ లా నేస్తం ద్వారా ఆర్నెళ్లకు కలిపి ఒకేసారి మొత్తం రూ.30 వేలు అందిస్తే జూనియర్ న్యాయవాదులకు ఇంకా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో క్రితంసారి మార్పులు చేశాం. మళ్లీ డిసెంబరులో ఈ ఏడాది రెండో దఫాకి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంది. వీటన్నింటి వల్ల న్యాయవాదులకు మంచి జరగాలని కోరుకుంటున్నా. మీ స్ఫూర్తితో పేదలకు సాయం చేస్తా.. గుంటూరు బార్ అసోసియేషన్‌లో జూనియర్ అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయా. మా బాబాయి కూలి పనులు చేస్తూ తన పిల్లలతో పాటు నన్ను చదివించారు. లా కోర్సు పూర్తవగానే గుంటూరులో ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు. స్పందనలో దరఖాస్తు చేసుకోగానే మహిళా ప్రాంగణంలో వసతి కల్పించారు. వైఎస్సార్ లా నేస్తం కింద నెలకు రూ.ఐదు వేలు చొప్పున రెండేళ్లుగా క్రమం తప్పకుండా అందుతోంది. మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన వస్తోంది. పిన్నికి చేయూత అందుతోంది. మా కుటుంబ సభ్యులంతా మీ పథకాలను పొందుతున్నారు. అందరి సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఇలాంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీర్ఘకాలం ప్రజలకు సేవ అందించాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మీ స్ఫూర్తితో పేదలకు న్యాయం సాయం చేస్తానని మాట ఇస్తున్నా సార్. – రత్నకుమారి, న్యాయవాది, గుంటూరు ఎంతో ఉపయోగం.. జూనియర్ అడ్వొకేట్‌గా 2020లో బెజవాడ బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ ప్రారంభించా. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వొకేట్స్ లబ్ధి పొందుతున్నారు. లా నేస్తం పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి మంజూరు చేశారు. మీరు అందిస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. అడ్వొకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది. – అరవింద్, అడ్వొకేట్, విజయవాడ -
‘నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను.. మీరు చాలా సాయం చేశారు’
సాక్షి, తాడేపల్లి: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో వర్చువల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన న్యాయవాదులు ఏమన్నారంటే, వారి మాటల్లోనే సార్, నమస్కారం, నేను గుంటూరు బార్ ఆసోసియేషన్ లో జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను నిరుపేద కుటుంబంలో పుట్టాను, చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయాను, మా బాబాయి కూలీ పనులు చేస్తూ తన పిల్లలతో పాటు చదివించారు, నేను లా చదువుతాననగానే ఒప్పుకుని లా చదివించారు, చదువు పూర్తవగానే గుంటూరు వచ్చి ఇక్కడ ఎక్కడ ఉండాలో అర్ధం కాలేదు, స్పందనలో అప్లికేషన్ పెట్టగానే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అకామిడేషన్ ఇప్పించారు, మా బాబాయి పిల్లలకు అమ్మ ఒడి వస్తుంది, విద్యా కానుక వస్తుంది, మా తమ్ముడికి విద్యా దీవెన వస్తుంది, పిన్నికి చేయూత వస్తుంది, నేనే కాదు కుటుంబ సభ్యులు అందరూ మీ పథకాలు పొందుతున్నారు, నేను లా పూర్తి చేయడానికి మీరు చాలా సాయం చేశారు, మీకు రుణపడి ఉంటాను, ఇలాంటి మంచి పాలన ఉంటుందనుకోలేదు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటాను, మీ స్పూర్తితో నేను పేదలకు న్యాయం విషయంలో సహాయం చేస్తానని మీకు మాట ఇస్తున్నాను, థ్యాంక్యూ సార్. -రత్న కుమారి, న్యాయవాది, గుంటూరు సార్, నేను 2020 నుంచి జూనియర్ అడ్వకేట్ గా బెజవాడ బార్ అసోసియేషన్ లో ప్రాక్టీస్ ప్రారంభించాను, చిన్నప్పటి నుంచి ఈ వృత్తి అంటే ప్రేమ, ఇష్టం, దీనికి మా కుటుంబ సభ్యులు కాస్త ఆందోళన చెందారు, కానీ నేను లా ప్రాక్టీస్ ప్రారంభించేసరికి మీరు అధికారంలోకి రావడం, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మీరు సాయం చేస్తుండడంతో మాలాంటి ఎంతోమంది జూనియర్ అడ్వకేట్స్ లబ్ధిపొందుతున్నారు. నేను ఈ పథకానికి దరఖాస్తు చేయగానే వెరిఫికేషన్ చేసి శాంక్షన్ చేశారు, మా కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, మీరు ఇస్తున్న ఈ సాయం నాకు చాలా ఉపయోగపడుతుంది, నాలాగా లబ్ధిపొందుతున్న వారందరి తరపునా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్, మా అడ్వకేట్స్ కమ్యూనిటీ నుంచి మా మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది, ధ్యాంక్యూ సార్. -అరవింద్, అడ్వకేట్, విజయవాడ చదవండి: ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు: సీఎం జగన్ -
వైఎస్ఆర్ లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది
-
Live: వైఎస్ఆర్ లా నేస్తం
-
YSR Law Nestham: ఇలాంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు: సీఎం జగన్
Updates ►‘వైఎస్సార్ లా నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగం నాలుగు సంవత్సరాలుగా లా నేస్తం అమలు చేస్తున్నాం: సీఎం 2677 మంది అడ్వకేట్ చెల్లెమ్మలకు, తమ్ములకు రూ.6.12 కోట్లను వారి ఖాతాల్లో జమచేస్తున్నాం లా కోర్సు పూర్తిచేసిన, మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో వారి కాళ్లమీద వాళ్లు నిలబడేందుకు, వారికి తోడుగా నిలుస్తూ ప్రతి నెలా రూ.5వేలు, ఏడాదిలో రూ.60వేలు ఇస్తున్నాం మూడేళ్లలో ఇలా ఒక్కొక్కరికీ రూ.1.8లక్షలు ఇస్తున్నాం దీనివల్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారు జీవితంలో ముందుకు వెళ్తారు మంచి ఆలోచనతో ఈ పథకం ప్రారంభించాం ఇప్పటవరకూ 5,781 మందికి మేలు చేశాం మొత్తంగా 41.52కోట్లు జూనియర్ లాయర్లకు ఇచ్చాం ఇలాంటి పథకం, ఇలాంటి ఆలోచన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుది అడ్వకేట్లకు అన్నిరకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్టును పెట్టడం జరిగింది మెడిక్లెయిం కాని, ఇతరత్రా అవసరాలకు రుణాలు కావొచ్చు… ఈ ఫండ్ నుంచి రూ.25 కోట్లు సహాయం చేయడం జరిగింది న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిచింది ప్రభుత్వం తరఫునుంచి న్యాయవాదులను కోరేది ఒక్కటే జూనియర్లుగా ఉన్న న్యాయవాదులు ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల మంచి జరిగితే.. వీరు స్థిరపడ్డాక ఇదే మమకారం వీళ్లు పేదలపట్ల చూపిస్తారన్న విశ్వాసం ఒక అన్నగా, ఒక స్నేహితుడిగా వారి దగ్గరనుంచి ఆశిస్తున్నది ఇదే దీన్ని ఎప్పుడూ మరిచిపోవద్దని కోరుతున్నాను ►రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని బటన్ నొక్కి విడుదల చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ►ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు. ► ప్రభుత్వం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది. ► న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా రూ.100 కోట్లతో ‘అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి.. న్యాయవాదులకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, తదితర అవసరాల కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం అందించింది. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్లైన్లో sec_law@ap. gov.in ద్వారా/నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవాదుల ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నంబర్‌ను అందుబాటులో ఉంచింది. -
YSR లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్
-
నేడు వైఎస్సార్ లా నేస్తం ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు రూ.5 వేల స్టైఫండ్ చొప్పున 2023–24 సంవత్సరానికి మొదటివిడత ‘వైఎస్సార్ లా నేస్తం’ ఆర్థిక ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు (5 నెలలు) రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.6,12,65,000 జమ చేయనున్నారు. ప్రభుత్వం కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్ల పాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ.. మొత్తం రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో కలిపి ఇప్పటివరకు 5,781 మంది యువ న్యాయవాదులకు రూ.41.52 కోట్లు చెల్లించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీ సభ్యులుగా రూ.100 కోట్లతో ‘అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి.. న్యాయవాదులకు రుణాలు, గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీలు, తదితర అవసరాల కోసం ఇప్పటికే రూ.25 కోట్ల సాయం అందించింది. ఆర్థిక సాయం కోరే న్యాయవాదులు ఆన్లైన్లో sec_law@ap. gov.in ద్వారా/నేరుగా లా సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. వైఎస్సార్ లా నేస్తం పథకానికి సంబంధించి న్యాయవాదుల ఇబ్బందులను అధిగమించేందుకు 1902 నంబర్‌ను అందుబాటులో ఉంచింది. -
వైఎస్ఆర్ లా నేస్తం పథకం నిధులు విడుదల
-
మన లక్ష్యం.. పేదలకు ‘న్యాయం’
సాక్షి, అమరావతి: న్యాయవాదులకు అండగా ఉండేందుకు ‘వైఎస్సార్ లా నేస్తం’ తీసుకొచ్చామని, పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు వృత్తి జీవితంలో పేదలకు సాయపడాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. పథకంలో కొద్ది మార్పులు చేసి ఆర్నెల్లకు ఒకసారి, ఏడాదికి 2 దఫాలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘వైఎస్సార్ లా నేస్తం’ ద్వారా దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతి నెలా ఆదుకున్నామని వెల్లడించారు. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతోపాటు కోవిడ్ సమయంలో దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు ప్రయోజనం చేకూర్చినట్లు వివరించారు. పేదవాడి పట్ల న్యాయవాదులు అంకితభావం చూపాలని కోరారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్రవాప్తంగా 2,011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ.1,00,55,000 మేర ఆర్థికసాయాన్ని సీఎం జగన్ బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. సీఎం ఏమన్నారంటే.. వృత్తిలో ఊతమిచ్చేందుకు... దేవుడి దయతో గత మూడు సంవత్సరాలుగా మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా ఉందన్న సంకేతాన్ని గట్టిగా చెప్పేందుకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నా. న్యాయవాది వృత్తిని ఎంచుకున్నవారు మన రాజ్యాంగాన్ని, చట్టాలను క్షుణ్నంగా చదువుకుని న్యాయవాదులుగా స్ధిరపడే క్రమంలో తొలి మూడేళ్లు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో పాదయాత్ర సందర్భంగా చాలాసార్లు నా దృష్టికి తెచ్చారు. వారంతా సొంత కాళ్ల మీద నిలబడే ఒక గొప్ప పథకం ఇది. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమం న్యాయవాదులుగా స్థిరపడేందుకు దోహదం చేస్తుంది. ప్రభుత్వం వారికి తోడుగా నిలవడం వల్ల డబ్బులు లేని పేదవాడికి సాయం చేయగలుగుతారనే విశ్వాసం ఉంది. ప్రభుత్వం తమకు తోడుగా నిలిచినట్లుగానే, తాము కూడా పేదలకు సాయపడాలనే తలంపు వారి మనసులో మెదలాలన్నదే మా ఆరాటం. చదువు పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన తరువాత తొలి మూడేళ్లు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడం కోసం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చాం. ఇది వారికి వృత్తిలో ఊతమివ్వడంతో పాటు స్ధిరపడేందుకు దోహదం చేస్తుంది. మూడున్నరేళ్లలో 4,248 మందికి లబ్ధి.. ఈ పథకం ద్వారా మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్లను ప్రతి నెలా ఆదుకున్నాం. రూ.35.40 కోట్లు సహాయంగా అందించాం. ఈరోజు 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు పథకంలో కొనసాగుతున్నారు. వీరికి ఇవాళ దాదాపు రూ.కోటికి పైగా జమ చేస్తున్నాం. ఒకేసారి పెద్ద అమౌంట్ ఇస్తే వారి అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పథకంలో కొద్ది మార్పులు చేసి ఆర్నెల్లకు ఒకసారి, ఏడాదికి 2 సార్లు అందచేస్తున్నాం. రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్... న్యాయవాదుల సంక్షేమం కోసం మరో గొప్ప అడుగు వేసి రూ.100 కోట్లతో లాయర్ల కార్పస్ ఫండ్ నెలకొల్పాం. కోవిడ్ సమయంలో కార్పస్ ఫండ్ ద్వారా దాదాపు రూ.25 కోట్ల మేర మంచి చేయగలిగాం. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటూ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం లా సెక్రటరీకి నేరుగా దరఖాస్తుతో పాటు ఆన్లైన్లో లా సెక్రటరీ మెయిల్ ఐడీకి కూడా దరఖాస్తు చేయవచ్చు. sec&law@ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక లా నేస్తం పథకానికి సంబంధించి కూడా పారదర్శకంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి చేసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉన్న తుపాకీ లాంటిదని, హంతకుడి చేతిలో ఉండే బాకు లాంటిది కాదని చెబుతుంటారు. నేను మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు దాన్ని గుర్తుంచుకుని అదే అంకిత భావాన్ని పేదవాడి పట్ల చూపాలని కోరుతున్నా. ఈ కార్యక్రమంలో లా సెక్రటరీ జి.సత్యప్రభాకరరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెరిగింది బెజవాడ బార్ అసోసియేషన్‌లో ఏడాది నుంచి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. మంచి క్రిమినల్ లాయర్ అవ్వాలన్నది నా లక్ష్యం. మాది మధ్యతరగతి కుటుంబం కావడంతోకోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతావు? మంచి జీతం వచ్చే ఉద్యోగంలో చేరమని తల్లిదండ్రులు చెబుతుంటారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వైఎస్సార్ లా నేస్తం పథకం ఎంతో ఉపయోగపడింది. దీంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. తల్లిదండ్రులపై ఆధారపడకుండా నేను నిలదొక్కుకునేందుకు ఈ పథకమే కారణం. పాదయాత్ర హామీని సీఎం జగన్ నెరవేర్చడంతో చాలా సంతోషంగా ఉన్నాం,ద్యాంక్యూ సార్. –అమూల్య, లా నేస్తం లబ్ధిదారు, జూనియర్ న్యాయవాది, ఎన్టీఆర్ జిల్లా ఉన్నత చదువులకు ఉపకారం.. జూనియర్ అడ్వకేట్‌గా పని చేస్తున్నా. అమ్మ టైలరింగ్ చేస్తుండగా నాన్న ప్రైవేట్ ఉద్యోగి. 2021 నుంచి లా నేస్తం తీసుకుంటున్నా. ఈ డబ్బులు జ్యూడీషియల్ ఎగ్జామ్స్ ఫీజు కోసం, మెటీరియల్ తీసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఉన్నత చదువులకు మీరు ఇస్తున్న సపోర్ట్ ఎంతో బాగుంది. విద్యార్థులకు మంచి పథకాలు ప్రవేశపెట్టారు. విదేశాల్లో చదువుకునేందుకు కూడా సాయం చేస్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని పేద విద్యార్ధులకు ఉచితంగా సాయం చేయాలనుకుంటున్నా. రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు మీవల్ల ప్రయోజనం పొందుతున్నాయి. పెన్షన్, రేషన్ ఇంటి దగ్గరే ఇస్తున్నారు. మా అమ్మకు ఇంటి పట్టా వచ్చింది. –సీహెచ్. వెన్నెల, జూనియర్ న్యాయవాది, గుంటూరు -
లా నేస్తం నిధులు విడుదల చేసిన సీఎం వై ఎస్ జగన్
-
ఇకపై ‘లా నేస్తం’ పథకం ఏడాదికి రెండుసార్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఇకపై ‘లా నేస్తం’ పథకాన్ని ఏడాదికి రెండు సార్లు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను ఏపీ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ కచ్చితంగా ఉపయోగపడుతుందని సీఎం అన్నారు ‘‘గత మూడున్నరేళ్లలో 4,248 మంది లాయర్లకు ‘లా నేస్తం’ అందించాం. ఇప్పటి వరకు రూ.35.40 కోట్లు అందించాం. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,011 మంది అడ్వకేట్లకు ‘లా నేస్తం’ అందిస్తున్నాం. 2,011 మంది అడ్వకేట్లకు రూ.కోటి 55 వేలు జమ చేస్తున్నాం. ఇకపై ‘లా నేస్తం’ పథకాన్ని ఏడాదికి రెండుసార్లు అందిస్తాం అడ్వకేట్ల కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం’’ అని సీఎం అన్నారు. ‘‘న్యాయ వాదులుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మొదటి మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులుంటాయని నాకు పాదయాత్రలో చెప్పారు. వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలిగే వృత్తిలో ఉన్నారు. ప్రభుత్వం తోడుగా నిలబడ్డం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేయగులుగుతారనే విశ్వాసం ఉంది. ఈ పథకంలో కొంత మార్పులు తీసుకు వచ్చాం. ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 దఫాలుగా ఇచ్చేందుకు నిర్ణయించాం. వారి అవసరాలు తీర్చుకునేలా వారికి ఉపయోగపడుతుందని. రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం. దాదాపు రూ.25 కోట్ల మేర లాయర్లకు కోవిడ్ సమయంలో మంచి కూడా జరిగింది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘అత్యంత పారదర్శకంగా దీన్ని అమలు చేస్తున్నాం. ఆధీకృత వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. సంతృప్త స్థాయిలో దీన్ని అమలు చేస్తున్నాం. ఒక్కరు కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో అమలు చేస్తున్నాం. మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ పథకం ద్వారా మంచిని పొందుతున్న లాయర్లు, పేదవాడిపట్ల అదే అంకిత భావాన్ని చూపాలని కోరుతున్నాను. మీ వృత్తుల్లో మరింత రాణించాలని మనసారా కోరుకుంటున్నాను’’అని సీఎం జగన్ అన్నారు. చదవండి: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గవర్నర్‌కు సీఎం జగన్ ఆత్మీయ వీడ్కోలు -
లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకే లా నేస్తం : సీఎం జగన్
-
వైఎస్సార్ ‘లా నేస్తం’ నిధులు విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గత మూడేళ్లుగా ‘లా నేస్తం’ నిధులు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకు ‘లా నేస్తం’ అని సీఎం అన్నారు. లా డిగ్రీ తీసుకున్న తర్వాత తొలి మూడేళ్లు న్యాయవాదిగా స్థిరపడేందుకు ‘లా నేస్తం’ కచ్చితంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల కోసం రూ.1,00,55,000లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం వైఎస్ జగన్ బుధవారం.. సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ఆ మొత్తాన్ని జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లోకి జమ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లా నేస్తం ద్వారా కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు వృత్తిలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని నిలబడేందుకు వీలుగా అర్హులైన ప్రతీ జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5వేల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బుధవారం చెల్లించిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు 4,248 మంది న్యాయవాదులకు మూడున్నరేళ్లలో అందించిన ఆర్థిక సాయం రూ.35.40 కోట్లు. ఇదే సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందుకోసం అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో న్యాయ, ఆర్థిక శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఓ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది. కోవిడ్ సమయంలో న్యాయవాదులను ఆదుకునేందుకు ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన న్యాయవాదులకు రుణం, బీమా, ఇతర వైద్య అవసరాల నిమిత్తం ఈ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందచేస్తారు.