యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం | Ysr law nestham for Young Lawyers | Sakshi
Sakshi News home page

యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం

Published Mon, Dec 11 2023 5:10 AM | Last Updated on Mon, Dec 11 2023 9:37 AM

Ysr law nestham for Young Lawyers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్‌ న్యాయ­వాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవి­డత వైఎస్సార్‌ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరునెలలకు ఒక్కొ­క్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేయను­న్నారు.

కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంది. ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తోంది. నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసింది.

న్యాయవాదుల అవసరా­లకు రుణాలు, గ్రూప్‌ మెడిక్లెయిమ్‌ పాలసీలు, ఇతర అవసరాలకోసం ఈ ట్రస్ట్‌ ద్వారా ఇప్పటికే రూ.25 కోట్ల ఆర్థికసాయం అందించింది. ఈ ట్రస్ట్‌ నుంచి ఆర్థికసాయం కోరే అడ్వకేట్స్‌ ఆన్‌లైన్‌లో ట్ఛఛిచి ్చఠీః్చp.జౌఠి.జీnలోగానీ, నేరుగా లా సెక్రటరీకిగానీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్‌ లా నేస్తం పథకానికి సంబంధించి ఏ రక­మైన ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా 1902 టోల్‌ ఫ్రీ నంబర్లో సంప్రదించవచ్చు.

ఈ పథకాన్ని మరింత సమర్థంగా మానిటర్‌ చేస్తూ యువ న్యాయవాదులు ఏకకాలంలో పెద్దమొత్తం సొమ్ము అందుకుని వారి అవసరాలు తీర్చుకునే విధ­ంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం వారి ఖాతాల్లో నిధులు జమచేస్తోంది. దర­ఖాస్తు చేసుకో­దలిచినవారు https://­ysrlawnestham.­ap.­gov.­in వెబ్‌సైట్‌లో తమ పేరు, బ్యాంకు అకౌంట్, ఆధార్‌ నంబరు, సర్టిఫికెట్లు జతచేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement