సాక్షి, హైదరాబాద్: దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న వస్త్ర పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూ స్తోందని మంత్రి కె.తారక రామా రావు విమర్శించారు. నేతన్నలకు కేంద్రం నోటిమాటలు కాకుండా నిధుల మూటలు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ టెక్స్‌టైల్ రంగానికి సాయం చేశామంటూ ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు అసత్యాలు వల్లె వేయడం మానుకోవాలన్నారు.
తెలంగాణలో టెక్స్‌టైల్ రంగానికి చేయూత ఇవ్వాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ శనివారం లేఖ రాశారు. కేంద్రం జీఎస్‌టీ విధింపు వంటి నిర్ణయాలతో నేత కార్మికుల పొట్టకొడుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.1,552 కోట్ల అంచనా వ్యయంతో చేప ట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో మౌలిక సదుపా యా లు కల్పించేందుకు ముందుకు రాకపోగా, పార్క్‌ను తానే ఏర్పా టుచేసినట్లు అసత్యాలు చెబుతోందని దుయ్యబట్టారు.
కాంప్రహెన్సివ్ పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ పథకం కింద సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపా దనపై కేంద్రం స్పందించలేదని కేటీఆర్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి వెళ్లగా, తెలంగాణలో మరో ఐఐహెచ్ టీ ఏర్పాటు చేయాలన్న వినతిపైనా కేంద్రం స్పందించడం లేదని విమర్శించారు. హైదరాబాద్‌లో నేషనల్ టెక్స్‌టైల్ రీసెర్చ్ ఇని స్టిట్యూట్‌తో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటుపైనా కేంద్రం నుంచి స్పందన లేదని వెల్లడించారు.
బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేయండి
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం(ఎన్‌హెచ్‌డీపీ)లో భాగంగా తెలంగాణలో 15 బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలనే తెలంగాణ విజ్ఞప్తిని మోదీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని కేటీఆర్ విమర్శించారు. వస్త్ర పరిశ్రమపై విధించిన జీఎస్‌టీని తగ్గించడంతోపాటు జీఎస్‌టీ నుంచి చేనేత పరిశ్రమను పూర్తిగా మినహాయించాలన్నారు. రాష్ట్రంలోని మరమగ్గాల ఆధునికీకరణకు అవసరమయ్యే నిధుల్లో 50 శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేంద్ర ప్రభు త్వం వాటా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టెక్స్‌టైల్ రంగంలో బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల కంటే భారత్ వెనుకంజలో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ఊతమివ్వాలని కోరారు.
ఇది కూడా చదవండి: నడి వీధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment