బైక్పై భార్యాభర్త మొండిగా వరద దాటుతూ.. | couple fell in flood water in nalgonda pochampally | Sakshi
Sakshi News home page

బైక్పై భార్యాభర్త మొండిగా వరద దాటుతూ..

Published Thu, Sep 1 2016 9:37 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

బైక్పై భార్యాభర్త మొండిగా వరద దాటుతూ.. - Sakshi

బైక్పై భార్యాభర్త మొండిగా వరద దాటుతూ..

పోచంపల్లి: భారీ వర్షాల కారణంగా పోటెత్తున్న వరదలను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా పలువురు వాటిని లెక్క చేయకుండా ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. రెప్పపాటు సమయంలో ఆలోచన లేకుండా వ్యవహరించడం మూలంగా నష్టపోతున్నారు. నల్లగొండ జిల్లాలో ఓ భార్యాభర్తలకు భారీ వరద నుంచి ప్రమాదం తప్పింది. స్థానికుల అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. బుధవారం కురిసిన భారీ వర్షాలకు పొర్లుతున్న పోచంపల్లి వాగులో వారు ప్రమాదవశాత్తు పడిపోయి అదృష్టం కొద్ది ప్రాణం దక్కించుకున్నారు.

వారు ప్రయాణిస్తున్ బైక్ మాత్రంలో వాగులో వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. బుధవారం భారీ స్థాయిలో వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కనీసం మూడు గంటలపాటు కురిసిన ఈ వర్షం కారణంగా వాగులు వంకలు ప్రమాదకర స్థితిలో పొంగిపొర్లుతున్నాయి. వాటిని చూస్తేనే గుండెలు జారీ పోతున్నాయి. పోచంపల్లిలోని ఓ వాగు పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

అది ఉధృతంగా రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో పలువురు దాన్ని దాటేందుకు సంకోచిస్తూ దూరంగా ఉండి పరిశీలిస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు భార్యభర్తలు మాత్రం మూర్ఖంగా ముందుకెళ్లి ఆ వరదలో పడ్డారు. బైక్తోపాటు వారు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడగా అక్కడ అప్పటికే ఉన్న ఇతరులు సమయస్ఫూర్తితో వ్యవహరించి బయటకు తీసుకొచ్చారు. బైక్ను తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. దీంతో అది వరదల్లో కొట్టుకుపోయింది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement