సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికలపై సంచలన కామెంట్స చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ మద్దతు లేకుండా ఎవరూ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాగా, మంత్రి కేటీఆర్ శనివారం యాదాద్రి భువనగిరి పర్యటనలో ఉన్నారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నేతన్నకు ప్రతీక మగ్గం. సీఎం కేసీఆర్‌కు నేతన్నల కష్టాలు తెలుసు. నేతన్నల సంక్షేమం కోసం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. చేనేత మిత్ర పేరుతో నూలు, రసాయనాల మీద 50 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. నేతన్నకు చేయూత పేరిట పొదుపు పథకం తీసుకొచ్చాం. రైతుబీమా తరహాలో నేతన్నకు బీమా తెచ్చాం. ఇవన్నీ కేసీఆర్ సీఎం కావడం వల్లే సాధ్యమైందన్నారు.
చేనేత ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఉంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు. ఉప్పల్‌లో హ్యాండ్లూమ్ మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పోచంపల్లి చేనేత కళాకారులు భాగస్వాములై వినియోగించుకోవాలి. నేత కార్మికులను సంఘటితం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అండగా ఉంటుంది. మాది కోతల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం. 2001లో భూదాన్ పోచంపల్లిలో నేతన్నలను కాపాడుకునే ప్రయత్నం చేశామని కేటీఆర్ వివరించారు.
ఇది కూడా చదవండి: నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు.. వైన్స్ టెండర్లు మాత్రం క్లియర్.. కేసీఆర్ సర్కార్ బీజేపీ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment