భూదాన్‌పోచంపల్లి(నల్గొండ జిల్లా): భూదాన్‌పోచంపల్లి పరిధిలో గురువారం వడగళ్లవాన కురిసింది. వడగళ్ల వర్షం కారణంగా సుమారు 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. జలాల్‌పురం గ్రామంలో ఓ చెట్టు మీద పిడుగుపడింది. మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇంటిపై పడ్డాయి. సకాలంలో అక్కడే ఉన్న మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.