జలాల్‌పురం చెరువుకట్టపై బారికేడ్లు ఏర్పాటు | Barricades set up on Jalalpuram Cheruvu to avoid accidents | Sakshi
Sakshi News home page

Jalalpuram: జలాల్‌పురం చెరువుకట్టపై బారికేడ్లు ఏర్పాటు

Published Wed, Dec 25 2024 4:59 PM | Last Updated on Wed, Dec 25 2024 5:10 PM

Barricades set up on Jalalpuram Cheruvu to avoid accidents

భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పురం (Jalalpuram) చెరువు కట్టపై రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం బారికేడ్లు (Barricades) ఏర్పాటు చేశారు. గడిచిన పదిహేను రోజుల్లో రెండు కార్లు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో రక్షణ చర్యలు చేపట్టడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ‘అసలే ఇరుకు.. ఆపై మలుపు’ అనే శీర్షికన ఈనెల 22న సాక్షి (Sakshi) మెయిన్‌లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ప్రమాదాలు నివారించడానికి పోలీసులు చెరువు కట్టపై 11 భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మెనర్‌ డ్రైవింగ్‌.. తల్లికి శిక్ష 
సిరిసిల్ల క్రైం: బాలుడు వాహనం నడుపుతూ ఒకరి మరణానికి కారణమైన కేసులో.. అతని తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనపై డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం అందించిన వివరాలివి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం బస్టాండ్‌ సమీపంలో ఈ నెల 18న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. రుద్రంగి మండలానికి చెందిన గడ్డం లక్ష్మి.. మైనర్‌ అయినప్పటికీ తన కొడుక్కి వాహనం ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగింది.

చ‌ద‌వండి: గుండెపోటుతో ఎంబీబీఎస్‌ స్టూడెంట్‌ మృతి

ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కంటే రాములు (72) తీవ్రగాయాలతో మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్‌కు బైక్‌ ఇచ్చిన తల్లిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే.. పెద్దలు జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement