
సాక్షి, యాదాద్రి: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఆమె రోడ్డు మార్గంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.00 గంటలకు పోచంపల్లికి చేరుకుంటారు.
అక్కడ శ్రీరంజన్ వీవ్స్‌ను సందర్శించి మగ్గం నేయడం, నూలు వడకడం, రీలింగ్ తదితర ప్రక్రియలను పరిశీలిస్తారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన చేనేత ఉత్పత్తుల స్టాళ్లను, మగ్గాలను తిలకిస్తారు. అనంతరం అక్కడే చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, అమ్మకాలపై ఆయా వర్గాల ముఖ్యులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. వినోబా భావే, వెదిరె రామచంద్రారెడ్డి చిత్ర పటాలకు నివాళులర్పిస్తారు. అనంతరం 12.20 గంటలకు పోచంపల్లి నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment