నవ వధువు ఆత్మహత్య.. ఆ తగాదాలే కారణమా..? | Newly Married Woman Commits Suicide in Nelimarla | Sakshi
Sakshi News home page

నవ వధువు ఆత్మహత్య.. ఆ తగాదాలే కారణమా..?

Published Sun, Apr 17 2022 1:05 PM | Last Updated on Sun, Apr 17 2022 1:05 PM

Newly Married Woman Commits Suicide in Nelimarla - Sakshi

భానుశృతి(ఫైల్‌)

సాక్షి, నెల్లిమర్ల: పట్టణానికి చెందిన ఓ నవ వధువు శనివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు అందించిన వివరాలు.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి ఇందిరా కాలనీకి చెందిన వి.భానుశృతి(25)కి విశాఖపట్నంకు చెందిన అరుణ్‌కుమార్‌తో వివాహమైంది. అరుణ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

వివాహం అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు నెలకొన్నాయి. భర్త వేధిస్తున్నట్లు ఇప్పటికే దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం భానుశృతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితమే పెళ్లయిన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.   

చదవండి: (భూమా అఖిలప్రియపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోదరుడు) 

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement