Newly married woman suicide
-
వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: తరచూ సెల్ఫోన్లో వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలించినందుకు ఓ నవవధువు రెండో అంతస్తు నుంచి దూకి అత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్‌రెడ్డి, మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. విజయవాడకు చెందిన కమల, జనార్దన్‌రెడ్డిల కుమార్తె శైలు(20) వివాహం కడప జిల్లా పులివెందులకు చెందిన ఓబుల్‌రెడ్డి కుమారుడు గంగప్రసాద్‌రెడ్డితో 2022 అక్టోబర్ 16న జరిగింది. గంగప్రసాద్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా దంపతులు చింతల్‌లోని శ్రీసాయికాలనీలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. పెళ్లికి ముందు సైతం శైలు సెల్ఫోన్లో ఎక్కువగా షార్ట్ వీడియోలు చూస్తూ ఉండేది. పెళ్లయిన తర్వాత కూడా ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తోనే గడుపుతుండటంతో దంపతుల మధ్య గొడవ జరిగేది. ఇదే విషయమై బుధవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో శైలు బుధవారం రాత్రి తాను అత్మహత్య చేసుకుంటానని భర్తతో చెప్పింది. భయపడిన ప్రసాద్‌రెడ్డి శైలు తల్లి కమలకు తెలిపి ఆమె హైదరాబాద్ వచ్చేందుకు బస్ టికెట్ బుక్ చేశాడు.ఆమె విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయలేదేరింది. గురువారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో శైలు.. భర్త ప్రసాద్‌రెడ్డి పడుకున్నది చూసి వారు ఉంటున్న రెండవ అంతస్తు నుంచి దూకింది. శబ్దం విన్న భర్త కిందకి వచ్చి చూడగా శైలు రక్తపు మడుగులో పడి మృతిచెంది ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించారు. శైలు తల్లి కమల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. -
Krishna District: సెల్‌ఫోన్ వివాదం.. నవ వధువు ఆత్మహత్య
తోట్లవల్లూరు (కృష్ణా): పెళ్లయిన నాలుగు నెలలకే ఆమెకు నూరేళ్లు నిండాయి. సెల్‌ఫోన్ కారణంగా జరిగిన గొడవ నవ వధువు ప్రాణాలు బలితీసుకుంది. కలుపు మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన వల్లూరు యోహాను, మరియమ్మ దంపతుల చిన్న కుమార్తె రత్నకుమారి(19)ను ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన పేటేటి సన్నీకి ఇచ్చి ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహం చేశారు. సన్నీ వ్యవసాయ పనుల రీత్యా భద్రిరాజుపాలెంలోని అత్తగారి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నెల 13న సెల్‌ఫోన్ కారణంగా రత్నకుమారితో చిన్నగొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రత్నకుమారి ఇంటి ఆవరణలో ఉన్న కలుపు మందు తాగి అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. చదవండి: (కంతేరు ఘటనలో సునీత ఆత్మహత్యాయత్నం) కుటుంబసభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. రత్నకుమారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లయి నాలుగు నెలలు కూడా నిండక ముందే మృతి చెందడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రత్నకుమారి ఇటీవల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు కూడా రాసినట్లుగా తెలిసింది. మృతురాలి తండ్రి యోహాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అర్జున్ తెలియజేశారు. ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రెండు నెలల క్రితమే పెళ్లి.. కోడలు రాకతోనే ప్రమాదం జరిగిందని
సాక్షి, కరీంనగర్/ పటాన్‌చెరుటౌన్: అదనపు కట్నం వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డీఎస్పీ భీంరెడ్డి, సీఐ శ్రీనివాసులురెడ్డి వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా సోఫీనగర్‌కు చెందిన సంయుక్త(24) బీటెక్ పూర్తి చేసింది. సంయుక్తను నిజామాబాద్ జిల్లాకు చెందిన ఉత్తేజ్ కుమార్‌కు ఇచ్చి ఏప్రిల్ 7న వివాహం చేశారు. ఉత్తేజ్ కొండాపూర్‌లోని యాక్సిస్ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పెళ్లైన నాలుగు రోజులకే ఇంటి దైవానికి పూజ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో కోడలు రాకతో ప్రమాదం జరిగిందని కొత్తకారు ఇప్పించాలని కోడలిని అత్త వేధించడం మొదలుపెట్టింది. అనంతరం భార్యాభర్తలు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బంధం కొమ్ము గ్రామం శ్రీదామా హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. సంయుక్తను తరచూ అత్త లావణ్య, మామ పవన్‌కుమార్ ఫోన్లో పెళ్లి సమయంలో రూ.15లక్షల కట్నం, పది తులాల బంగారం ఇచ్చారని, మరో సంబంధం చేసుకుంటే కట్నం ఎక్కువ వచ్చేదని వేధించేవారు. వీరితో పాటు భర్త కూడా అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో ఉత్తేజ్ బుధవారం ఉదయం విధులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చేసరికి సంయుక్త ఉరేసుకుని కనిపించింది. అమీన్పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వీరశెట్టి విజయ్‌దర్శన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమ కూతుర్ని ఆమె భర్త ఉత్తేజ్ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని సంయుక్త తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదవండి: ఇష్టం లేని పెళ్లి చేశారని.. ఆ భర్త ఎంత పనిచేశాడంటే? -
నవ వధువు ఆత్మహత్య.. ఆ తగాదాలే కారణమా..?
సాక్షి, నెల్లిమర్ల: పట్టణానికి చెందిన ఓ నవ వధువు శనివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు అందించిన వివరాలు.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి ఇందిరా కాలనీకి చెందిన వి.భానుశృతి(25)కి విశాఖపట్నంకు చెందిన అరుణ్‌కుమార్‌తో వివాహమైంది. అరుణ్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తగాదాలు నెలకొన్నాయి. భర్త వేధిస్తున్నట్లు ఇప్పటికే దిశ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం భానుశృతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నాలుగు నెలల క్రితమే పెళ్లయిన కుమార్తె చనిపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (భూమా అఖిలప్రియపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన సోదరుడు) మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లయిన వారానికే నవ వధువు ఆత్మహత్య.. అదే కారణమా..?
సాక్షి, హైదరాబాద్(కుషాయిగూడ): ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్థాపం చెందిన ఓ నవవధువు.. కాళ్ల పారాణి ఆరక ముందే ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా, చెన్నరావుపేట మండలం, లింగగిరికి చెందిన ఏకాంతం నగరానికి వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటూ చర్లపల్లి, ఈసీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి కూతురు శైలజ (22)ను మేనల్లుడు సతీష్‌కిచ్చి ఈ నెల 17న వారి ఊళ్లోనే బంధువుల సమక్షంలో వివాహం జరిపించాడు. పెళ్లయిన వారం రోజుల తర్వాత అంతా కలిసి ఈ నెల 22న ఈసీనగర్‌కు వచ్చారు. బుధవారం ఉదయం సతీష్ ఉద్యోగానికి వెళ్లాడు. అదే సమయంలో తల్లి ఉన్న బెడ్రూంకు గడియ పెట్టి హాల్లో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. తనకు ఇష్టం లేని వివాహం చేయడం వల్లనే శైలజ ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
ప్రేమపెళ్లిపై పెద్దల పగ.. నవ వధువు ఆత్మహత్య
సాక్షి, మైసూరు: ప్రేమ పెళ్లిపై గ్రామపెద్దలు నానా రాద్ధాంతం చేయడం ఒకరి ప్రాణాలనుతీసింది. నగరంలోని మానసగంగోత్రిలో ఒక నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నంజనగూడు తాలూకా హడెతలె గ్రామానికి చెందిన శివణ్ణ నాయక కుమార్తె మంజుల (28)గా గుర్తించారు. హెమ్మరగాల గ్రామానికి చెందిన డ్రైవర్‌గా పనిచేసే సూర్యకుమార్ అనే యువకుడు మే నెలలో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదవండి: (16 ఏళ్లకే నూరేళ్లు నిండిన ఓ ఆడబిడ్డ ఆక్రందన ఇది..!) ఇద్దరి కులాలు వేరు కావడంతో రెండు గ్రామాల పెద్దలు పంచాయతీ పెట్టారు. గ్రామంలో ప్రజల అందరి ముందు క్షమాపణలు కోరాలని పట్టుబట్టారు. తామేం తప్పు చేయలేదని, క్షమాపణ ఎందుకు కోరాలని మంజుల తిరస్కరించి మానస గంగోత్రిలోని ఇంటికి వచ్చేశారు. గ్రామంలో జరిగిన అవమానంతో విరక్తి చెంది ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలు వివరిస్తూ డెత్‌నోట్‌ను రాసి ఉంచింది. సరస్వతిపురం పోలీసులు పరిశీలించి కేసు నమోదుచేశారు. చదవండి: (Hyderabad: నగరంలో వివాహిత అదృశ్యం..) -
పెళ్లయిన నెలరోజులకే.. నవవధువు ఆత్మహత్య
సాక్షి, హిందూపురం: నవవధువు ఆత్మహత్య కలకలం రేపింది. అదనపు కట్నం కోసం మెట్టినింటి వారి నుంచి వేధింపులు పెరిగిపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం రైల్వే రోడ్డు ప్రాంతంలో నివాసముంటున్న వెంకటేష్, లక్ష్మిదేవి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు హిందూపురంలోనే వివాహం చేశారు. రెండో కుమార్తె పల్లవి(28)ని పామిడిలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునకు ఇచ్చి ఆగస్ట్ 27న పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్నం కింద రూ.లక్ష నగదు, మరో రూ.లక్ష విలువ చేసే బంగారు నగలు అందజేశారు. కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లిన పల్లవిని కొద్దిరోజులకే అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధించడం మొదలు పెట్టారు. రోజురోజుకూ వేధింపులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పల్లవిని భర్త హిందూపురం తీసుకొచ్చి వదిలి వెళ్లాడు. అదనపు కట్నం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన పల్లవి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లాక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. చదవండి: (మానసిక వికలాంగుడిపై లైంగిక దాడి) కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు పల్లవి విగతజీవిగా కనిపించింది. భర్త, అత్త వేధింపులు భరించలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు లక్ష్మిదేవి, వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు, డీఎస్పీ రమ్య, వన్‌టౌన్ సీఐ బాలమద్దిలేటి ఆస్పత్రికి వెళ్లి నవ వధువు మృతదేహాన్ని పరిశీలించారు. -
సార్.. ఎవ్వరినీ వదిలిపెట్టొదు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు!
అత్తింటివారి వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైపోయింది. పెళ్లయిన నెల రోజులకే తనువు చాలించింది. భర్త, అత్తమామల వేధింపులకు నిండు నూరేళ్ల జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. సాక్షి, కడప: జీవితాంతం తోడు నీడగా ఉంటానని పచ్చని పెళ్లిపందిరిలో బాస చేసిన భర్త మాట తప్పాడు. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కడప నగరం నెహ్రూనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి, బంధువుల ఫిర్యాదు మేరకు చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. కడప చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పద్మజ కుమార్తె ఝాన్సీ(26)కి, రాజంపేట బోయిన పల్లికి చెందిన నల్లు సుబ్రమణ్యం, వెంకటసుబ్బమ్మల కుమారుడు రాధాకృష్ణతో గత నెల 15వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. రాధాకృష్ణ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వివాహ సమయంలో కట్నకానుకల కింద 15లక్షల రూపాయలు ఇచ్చారు. వివాహమైన రెండవరోజు నుంచే అధిక కట్నం కోసం వేధించడం మొదలు పెట్టారు. రూ. 70 లక్షలు ఇస్తేనే సంసారానికి రావాలంటూ ఈనెల 2వ తేదీన అత్తా, మామలు ఝాన్సీని కడపలోని నెహ్రూనగర్‌లో ఉన్న పుట్టింటిలో వదిలివెళ్లారు. చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో పెద్దమనుషులంతా కలిసి రాజంపేటలోని బోయినపల్లిలో ఉన్న రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పంచాయితీ చేశారు. తనకు రూ. 70 లక్షలు ఇస్తేనే తన భార్యను సంసారానికి తీసుకెళతానని తేల్చిచెప్పాడు. తన వల్ల తల్లి పద్మజ, తమ్ముడు పవన్, కుటుంబ సభ్యులకు అవమానంగా ఉందని భావించిన ఆ యువతి సూసైడ్ నోట్ రాసి, ఇంటిలో ఎవరూ గమనించని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి, తమ్ముడు గమనించే సరికి ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు. సార్.. ఎవ్వరినీ వదిలిపెట్టొదు.. డియర్ పోలీస్ డిపార్ట్మెంట్..ఎవ్వరినీ వదిలిపెట్టొ్టద్దు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు.. వాళ్లు చాలా క్రిమినల్ మైండ్ కలవాళ్లు.. మా తల్లిని, కుటుంబాన్ని రక్షించండి.. పవన్ ( తమ్ముడు) నువ్వు ఏడవద్దు.. మా తల్లికి, తమ్ముడికి భవిష్యత్తులో ఆపద వస్తే అది రాధాకృష్ణ వల్లనే... అంటూ సూసైడ్ నోట్లో రాసి ఉంది. అలాగే నా భర్త రాధాకృష్ణకు నేను అడ్డుగా ఉన్నా.. ఇప్పుడు తొలగిపోతున్నా... నువ్వు మీ చెల్లెళ్లను చూసుకో.. హ్యాపీగా ఉండు.. అని భర్తను ఉద్దేశించి కూడా రాసింది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిమ్స్ మార్చురీలోని మృతదేహాన్ని కడప డీఎస్పీ సునీల్ పరిశీలించారు. చిన్నచౌక్ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్ఐ అమర్నాథ్రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వరకట్న చావు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నచౌక్ సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. -
నాలుగు రోజుల కిందటే పెళ్లి.. అంతలోనే..
సాక్షి, యశవంతపుర: నాలుగు రోజుల కిందటే పెళ్లయింది. పెళ్లిబట్టలు కూడా మాసిపోలేదు. కానీ రెండో పెళ్లి ఇష్టం లేని ఆ మహిళ కూతురిని చంపి ఆపై ఆత్మహత్య చేసుకుంది. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా అనేమహల్ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. ఆనే మహల్‌కు చెందిన ప్రజ్వల (26), కూతురు సాధ్వి (2). ఆమె భర్త సురేంద్ర రెండున్నరేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోగా, ఆమె కూతురితో సహా హడ్లహళ్లిలోని పుట్టింటిలో ఉంటోంది. జీవితంలో ఒక తోడు ఉండాలని పెద్దలు ఆమెకు మోహన్ అనే వ్యక్తితో 16న పెళ్లి చేశారు. ఆమె మళ్లీ పెళ్లి వద్దే వద్దని చెప్పినా పెద్దలు వినిపించుకోలేదు. భర్త ఇంట్లో అకృత్యం భర్త కొత్త భార్య, కూతురిని సంతోషంగా ఆనెమహల్లోని తన ఇంటికి తీసుకొచ్చాడు. అతడు పనిమీద బయటకు వెళ్లిన సమయంలో కూతురికి చీరతో ఉరివేసి అదే చీరతో తానూ ఉరేసుకుంది. కాగా, మోహన్‌కు కూడా ఇది రెండో వివాహమే. మొదటి భార్య రెండున్నరేళ్ల క్రితం కాన్పు సమయంలో చనిపోయింది. దీంతో మరోసారి విధి ఆయనను కాటేసిందని స్థానికులు వాపోయారు. హాసన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: (ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం) -
‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’
సాక్షి, చిత్తూరు: మండలంలోని నవాబుకోటకు చెందిన అనూష (19) మంగళవారం అత్తింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ సుబ్బారెడ్డి కథనం...అనంతపురం జిల్లా తనకల్లు మండలం పాలెంవారిపల్లెకు చెందిన నెమలిపాళ్యం వెంకట్రమణ కుమార్తె అనూషకు మండలంలోని నవాబుకోటకు చెందిన నీరుగట్టి నరసింహులు కుమారుడు సుబ్రమణ్యంతో రెండు నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లి అంటేనే తనకు ఇష్టం లేదని, పుట్టింటికి వచ్చేస్తానని సోమవారం రాత్రి ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పింది. పెళ్లి అయ్యాకా చావైనా, బతుకైనా అత్తింట్లోనే ఉండాలని వారు సూచించారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందింది. తహశీల్దార్ కళావతి, వీఆర్వో నరసింహులు సమక్షంలో మృతదేహానికి పంచనామా నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: బిడ్డకు కొత్త బట్టలు కొనాలని వెళ్లాడు.. అంతలోనే -
'చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య..’
సాక్షి, సూర్యాపేట క్రైం/కేతేపల్లి: పెళ్లయిన ఆరు నెలలకే ఆమె కలలు కల్లలయ్యాయి. ప్రేమిస్తున్నానని వెంటపడి.. కట్నకానుకలు అసలే వద్దని చెప్పిన వ్యక్తిని పెద్దల సమక్షంలో పెళ్లాడింది.. కానీ పెళ్లయిన నాటి నుంచే భర్త, అత్తమామలు కట్నం కోసం వేధించసాగారు. దీంతో ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.. పోలీసులు, బంధువుల కథ నం ప్రకారం.. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌కు చెందిన ఎడ్ల సుందరయ్యకు నలుగు రు కుమార్తెలు.. వీరిలో పెద్ద కుమార్తె లావణ్య (25) సూర్యాపేటలోని బం ధువుల వద్ద ఉంటూ వెటర్నరీ సైన్స్ చదివింది. ఆ సమయంలోనే సూర్యాపేట చర్చి కాంపౌండ్‌కు చెందిన పెదపంగు ప్రణయ్‌తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా వీరి ప్రేమాయణం సాగింది. ఈ క్రమంలోనే ప్రణయ్‌కి ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. సూర్యాపేట మండలం బాలెంలలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా వారు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రణయ్ లావణ్య తండ్రి సుందరయ్యను కలిసి వారి ప్రేమ విషయం వివరించాడు.. ఎలాంటి కట్న కానుకలు వద్దని.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయినా సుందరయ్య వివాహ సమయంలో రూ.4 లక్షలు, 8 తులాల బంగారం, 20 గుంటల సాగు భూమిని కట్నంగా ఇచ్చాడు. పెద్దల సమక్షంలో గతేడాది జూన్ 12న బాప్టిస్టు చర్చిలో వివాహం చేశాడు. ఈ నేపథ్యంలోనే పెళ్లయిన నాటి నుంచి అదనపు కట్నం తేవాలని భర్త ప్రణయ్‌తో పాటు మామ కరుణానిధి, అత్త ఉజ్వల, మరిది సంజయ్.. లావణ్యను వేధించసాగారు. చదవండి: (చేయని నేరానికి బలైపోతున్నా..) లావణ్య మృతదేహంతో ఆందోళన చేస్తున్న బంధువులు భర్త ఇంటి ఎదుట ఆందోళన సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌం డ్లో భర్త ప్రణయ్ ఇంటి ఎదుట లావణ్య మృతదేహంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళనకు దిగారు. అత్తారింటి వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పేట పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. ఎందుకు వదిలి వెళ్లావంటూ ఆఖరి ఫోన్.. కట్నం తేవాలంటూ ఘర్షణ పడి ఈనెల 1న సాయంత్రం భార్య లావణ్యను ప్రణయ్ కొర్లపహాడ్లో అత్తారింటి వద్ద దింపి వెళ్లాడు. దీంతో మనస్తాపం చెందిన లావణ్య.. 2న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. చివరి క్షణాల్లో భర్త ప్రణయ్‌కు ఫోన్ చేసి ‘నన్ను ఎందుకు వదిలేసి వెళ్లావు’అంటూ రోదిస్తూ ప్రశ్నించింది. దీంతో ఆందోళన చెందిన ప్రణయ్.. ఆమె కుటుంబసభ్యులకు విషయాన్ని చెప్పాడు. వెంటనే వచ్చిన కుటుంబీకులు సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి లావణ్యను తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆమె రాత్రి మృతి చెందింది. లావణ్య తండ్రి సుందరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపారు. చావైనా.. బతుకైనా నీతోనే.. ఇటు భార్య లావణ్య మృతదేహంతో ఆందోళన చేస్తుండగా.. ఇంట్లో ఉన్న ప్రణయ్ పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుం బీకులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ‘అమ్మానాన్న.. నన్ను క్షమించండి.. నా భార్య లావణ్య దగ్గరికి వెళ్లిపోతున్నా.. నా భార్య చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించండి.. చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య..’ అంటూ అంతకుముందు ప్రణయ్ సూసైడ్‌నోట్ రాశాడు.. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
నవవధువు అనుమానాస్పద మృతి
సాక్షి, పుట్టపర్తి : వెంగళమ్మచెరువు గ్రామంలో నవ వధువు గీతాంజలి (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసమే చిత్రహింసలు పెట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు మెట్టినింటి వారిపై ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, పుట్టపర్తి, కొత్తచెరువు ఎస్ఐలు దాదాపీర్, వెంకటేశ్వర్లు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బకు చెందిన బొగ్గు కుళ్లాయప్ప, అలివేలమ్మ దంపతుల పెద్ద కుమార్తె గీతాంజలిని ముదిగుబ్బలోనే నివాసముంటన్న బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన ముసలప్ప, గంగమ్మ దంపతుల కుమారుడు అయిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సురేష్‌కు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.1.5 లక్షలు కట్నం కింద అందజేశారు. అయితే తమకు అదనంగా మరో రూ.లక్ష కావాలంటూ మెట్టినింటి వారు వేధించేవారు. నవదంపతులు శనివారం ఉదయం గంగిరెడ్డిపల్లి ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చి సాయంత్రం వెంగళమ్మచెరువులోని సురేష్ చిన్నాన్న చిన్నప్పయ్య ఇంటికి చేరుకున్నారు. చిన్నప్పయ్యకు చెందిన నూతన ఇంటిలో వారికి పడక ఏర్పాటు చేశారు. పొద్దుపోయిన తరువాత సురేష్ తన ముగ్గురు మిత్రులతో కలిసి పూటుగా మద్యం తాగాడు. ఇదే సమయంలో గీతాంజలి తన తల్లికి ఫోన్ చేసి తనకు భయమేస్తోందని, ఎవరో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని ఏడుస్తూ చెప్పింది. ఇంతలో సురేష్ ఫోన్ అందుకుని ‘ఏమీ లేదులే అత్తా.. నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చి పెట్టేశాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే గీతాంజలి ఉరికి వేలాడుతోంది. సురేష్ ఇంటి బయటకు వచ్చి కేకలు వేశాడు. ఇరుగుపొరుగు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, కొత్తచెరువు ఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. చదవండి: నెల రోజుల క్రితం వివాహం.. కొద్ది రోజులకే మృతిపై అనుమానాలు.. ఆదివారం ఉదయం కుమార్తె మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో వెంగళమ్మచెరువు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న గీతాంజలిని చూసి బోరున విలపించారు. కంటి పక్కన, కుడి కాలిపైన, గొంతుకింద, గాయాలతో పాటు చేయి విరిగిన ఆనవాళ్లు ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన అల్లుడు, వారి మిత్రులు, అతడి చిన్నాన్న కుటుంబ సభ్యులు కలిసి చిత్రహింసలు పెట్టి గీతాంజలిని చంపి.. తర్వాత ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గ్రామంలోని ఉన్నత పాఠశాల వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు. పోలీసులు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి బొగ్గు కుళ్లాయప్ప ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. చదవండి: పురుగుల మందు తాగి టిక్‌టాక్ -
మనసుకు నచ్చని మనువు చేశారని..
భర్త చేయి పట్టుకుని నిండు నూరేళ్లు జీవించాల్సిన ఓ నవ వధువు పసుపు,కుంకుమలు చెరగకముందే.. కాళ్ల పారాణి ఆరకముందే.. అచ్చట ముచ్చట తీరకుండానే.. మనసుకు నచ్చని మనువు చేశారని బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. చిత్తూరు జిల్లా /రామసముద్రం: మండలంలోని గంపనపల్లెలో ఓ నవ వధువు కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు.. మండలంలోని గంపనపల్లెకు చెందిన పునీశ్వర్ కుమార్తె టి.సరస్వతి (19) పెద్దపంజాణి మండలం లింగంరెడ్డిపల్లెకు చెందిన తన మామ జగదీష్‌కు ఇచ్చి మూడు రోజుల క్రితం వివాహం చేశారు. అయితే సరస్వతికి ఆ వివాహం ఇష్టం లేదు. అయినా పెద్దలు వివాహం చేశారు. సరస్వతి భర్త జగదీష్‌తో శుక్రవారం పుట్టింటికి వచ్చింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా సరస్వతి బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. మంటల్లో చిక్కుకున్న సరస్వతి గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మంటలను అదుపు చేసి, చికిత్సల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు ఎస్ఐ శివశంకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ వరకు చదువుకున్న సరస్వతి ఇష్టం లేని వివాహం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. -
నవ వధువు ఆత్మహత్య
బెంగళూరు (బనశంకరి) : పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన తేజస్విని (25) ఇక్కడి ఫిలిప్స్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తోంది. చెన్నైకి చెందిన దేవరాజ్ మెట్రిమోని ద్వారా తేజస్వినిని ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నగరంలోని తిండ్లుక్రాస్‌లోని ఓ అపార్టుమెంట్లో దంపతులు నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే వ్యాపారం కోసం కొంత పెట్టుబడి కావాలని తరచూ భార్య తేజస్విని దేవరాజ్ వేధించేవాడని సమాచారం. తేజస్విని తల్లిదండ్రులు కూడా సమీపంలోనే నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం తేజస్విని చివరిగా తల్లితో ఫోన్లో మాట్లాడింది. కొద్దిసేపు అనంతరం తేజస్విని ఉరి వేసుకుందని ఫోన్ రావడంతో తల్లిదండ్రులు హుటాహుటిన కుమార్తె ఇంటికి వెళ్లారు. అక్కడ తేజస్విని ఉరి వేసుకున్నృదశ్యం అనుమానంగా ఉండటంతో వారు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న మోదు చేసుకున్న పోలీసులు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ చేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోవడంతో భర్త దేవరాజ్, తేజస్వనిని హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.