
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, మైసూరు: ప్రేమ పెళ్లిపై గ్రామపెద్దలు నానా రాద్ధాంతం చేయడం ఒకరి ప్రాణాలనుతీసింది. నగరంలోని మానసగంగోత్రిలో ఒక నవ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. నంజనగూడు తాలూకా హడెతలె గ్రామానికి చెందిన శివణ్ణ నాయక కుమార్తె మంజుల (28)గా గుర్తించారు. హెమ్మరగాల గ్రామానికి చెందిన డ్రైవర్‌గా పనిచేసే సూర్యకుమార్ అనే యువకుడు మే నెలలో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
చదవండి: (16 ఏళ్లకే నూరేళ్లు నిండిన ఓ ఆడబిడ్డ ఆక్రందన ఇది..!)
ఇద్దరి కులాలు వేరు కావడంతో రెండు గ్రామాల పెద్దలు పంచాయతీ పెట్టారు. గ్రామంలో ప్రజల అందరి ముందు క్షమాపణలు కోరాలని పట్టుబట్టారు. తామేం తప్పు చేయలేదని, క్షమాపణ ఎందుకు కోరాలని మంజుల తిరస్కరించి మానస గంగోత్రిలోని ఇంటికి వచ్చేశారు. గ్రామంలో జరిగిన అవమానంతో విరక్తి చెంది ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణాలు వివరిస్తూ డెత్‌నోట్‌ను రాసి ఉంచింది. సరస్వతిపురం పోలీసులు పరిశీలించి కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment