సాక్షి, హైదరాబాద్: వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో సీఎంను అరుణ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు.
గతంలో ప్రతిపాదించిన వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని, పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందని చెప్పారు.
అలాగే వివేక్ కె.టంకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. బృందంలో రాజ్యసభ సభ్యుడు వందన చవాన్, కనకమేడల రవీంద్రకుమార్, దర్శన సింగ్, విల్సన్, లోక్‌సభ సభ్యుడు వీణాదేవి, జస్బీర్‌సింగ్ గిల్, రఘురామ కృష్ణరాజు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment