రోహిత్ వేముల దళితుడని రెవిన్యూ అధికారులు చెప్పినా.. రూపన్వాల్ కమిషన్ మాత్రం కాదని చెప్పడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ అన్నారు. శనివారం వైఎస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీసీ అప్పారావును రక్షించేందుకే రూపన్వాల్ కమిషన్‌ను వేశారా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలకు క్లీన్‌చిట్ ఇచ్చిన ఈ నివేదిక ఏకపక్షంగా ఉందని విమర్శించారు.కులవివక్షకు రోహిత్ బలయ్యాడనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం కోసం వెతకడం దారుణమని అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య లేఖలో కులవివక్ష గురించి రోహిత్ రాసిన విషయాలు కమిషన్‌కు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీయూ విద్యార్థుల ఆందోళనలకు వైఎస్ఆర్ సీపీ పూర్తి మద్దతిస్తుందని ఆరుణ్ కుమార్ స్పష్టం చేశారు.
Oct 8 2016 1:51 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement