హైదరాబాద్ : మెడికల్ షాపు యజమాని ఇంట్లో శనివారం రాత్రి దొంగలు పడి బీభత్సం సృష్టించారు. నగరంలోని చైతన్యపురి ఆర్.కే పురం కాలనీలోని రోడ్ నెంబర్ 5లోని అరుణ్ కుమార్ ఇంట్లో రాత్రి దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోని రూ.1.80 లక్షలతోపాటు బంగారు గాజులు, రెండు బంగారు గొలుసులు, ఓ నక్లెస్ ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అరుణ్కుమార్ ఇంటికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు.