
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనే జర్‌గా కొనసాగుతు న్న అరుణ్‌కుమార్ జైన్‌ను రైల్వే శాఖ పూర్తిస్థాయి జీఎంగా నియమించింది. పదోన్న తితో ఆయనకు పోస్టింగ్ ఇవ్వటంతో సోమ వారం అరుణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్ 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన దక్షిణ మధ్య రైల్వేలో ఇన్‌చార్జి జీఎంగా, అదనపు జీఎంగా, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్‌గా, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ మేనేజర్‌గా విధులు నిర్వహించారు.