పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు శనివారం దీక్షను విరమించారు.
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు శనివారం దీక్షను విరమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆయన దీక్షను విరమింపజేశారు.
జగ్గయ్యచెరువులో గృహాల కూల్చివేతపై గత ఐదు రోజులుగా పెండెం దొరబాబు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గృహాల కూల్చివేతపై జేసీని జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ విచారణకు ఆదేశించారు.