సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను వైట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు పని ఒత్తిడి తట్టుకోలేక రోజుకు ఎనిమిది లేదా తొమ్మిది సిగరెట్లు తాగే వాడిని. ఒక రోజు సిగరెట్ తాగుతూ మాలియాకు పట్టుబడ్డాను. అంతే సిగరెట్ తాగడం మానేయాలని నిర్ణయానికి వచ్చాను’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన వైట్‌హౌజ్ జీవితానికి సంబంధించిన గత స్మృతుల్లో వెల్లడించారు. అలా సిగరెట్ మానేయడానికి ఆయన ఎంత కష్టపడాల్సి వచ్చిందో కూడా అందులో ఆయన వివరించారు. ఒబామా అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు ‘మీరు సిగరెట్ తాగుతారా?’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయనెప్పుడూ సూటిగా సమాధానం ఇవ్వలేదు.
(చదవండి : రాహుల్ గాంధీకి ఆ పట్టుదల లేదు : ఒబామా)
సిగరెట్ తాగుతూ తన పెద్ద కూతురు మాలియాకు పట్టుబడ్డానని గత స్మృతుల్లో వెల్లడించిన ఒబామా.. మీడియాకు మాత్రం ఎప్పుడు పట్టుబడలేదు. అదే మాలియా స్నేహితులతో కలిసి సిగరెట్ తాగుతూ రెండు, మూడు సార్లు మీడియాకు దొరికి పోయారు. ఒబామా ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఉన్నప్పుడు తన తండ్రి కుటుంబ సభ్యుల ముందు తాగేవారు. 1987లో ఆయన తన కుటుంబ సభ్యుల ఇంటి ముందు కూర్చొని సిగరెట్ తాగుతున్న ఫొటోలు నేటికి అందుబాటులో ఉన్నాయి.
అయితే ఆ అలవాటుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందే ఒబామా స్వస్తి చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా శ్వేత భవనంలోకి అడుగు పెట్టాక పని ఒత్తిడి తట్టుకోలేక సిగరెట్ స్మోకింగ్ మళ్లీ మొదలు పెట్టానని, రోజుకు 8,9 సిగరెట్లు తాగే వాడినని ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పేరిట ఆయన రాసిన స్మృతుల్లో చెప్పారు. రోజుకు 8,9 కాదు, పది సిగరెట్లు కూడా తాగే వారని ఆయన భార్య మిషెల్లీ ఒబామా తెలిపారు. ఆయన రాసిన పుస్తకం నవంబర్ 17వ తేదీన మార్కెట్లోకి వస్తోంది. ఒబామా తాను వైట్‌హౌజ్‌లో గడిపిన రోజుల నాటి స్మృతులతోపాటు తన కుటుంబంలో ఎదురైన ఒడుదుడుకుల గురించి కూడా ఆ పుస్తకంలో ఆయన వెల్లడించారట.
వైట్‌హౌజ్‌లో సెగరెట్లు తాగేవాడిని: ఒబామా
Published Fri, Nov 13 2020 4:28 PM | Last Updated on Fri, Nov 13 2020 9:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment