ప్రజాస్వామ్యానికి ‘ట్రంప్’ముంపు
ఒబామా అధ్యక్షునిగా ఎన్నికైన వాస్తవాన్ని జీర్ణించుకోవడమే అసాధ్యం అన్న రీతిలోనే రిపబ్లికన్లు కనిపించారు. వాళ్లు అబద్ధాలను ఆయుధాలుగా ఉపయోగించారు. ఆఖరికి ఆయన జన్మ ధృవీకరణ పత్రం గురించి కూడా కట్టుకథలు అల్లారు. వేలం వెర్రితో ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడిన బృందానికి నాయకుడు ట్రంప్. ఒబామా రెండురకాలుగా బయటి వ్యక్తి అన్నట్టు సూచించారు. ఎలాగంటే - మొదటిది- ఆయన అమెరికన్ కాదు, రెండోది - ఆయన మహమ్మదీయుడు. ఉద్యోగాలంటూ వస్తున్న మెక్సికన్లు, యుద్ధమంటున్న మహమ్మదీయులు అమెరికాకు ‘‘ప్రమాదకరంగా’’ పరిణమించిన నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిత్వం ట్రంప్‌కు దక్కడం యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేం.
ఇలాంటి వేలం వెర్రి ప్రతికూల ప్రచారాలు తిరిగి తమకే చేటు చేస్తాయని మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందా? ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆ పార్టీ అవిశ్రాంతంగా సాగిస్తున్న ప్రతికూల ప్రచారంలో ఉద్వేగమే తప్ప, హేతువు లేదు. ఆ విమర్శలన్నీ వ్యక్తిగతమైనవే. మోదీ ప్రతిపాదించినది ఏదైనా సరే, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆఖరికి తాను ప్రతిపాదించినది గతంలో యూపీఏ అధికారంలో ఉండగా చేసినదేనని మోదీ చెప్పినా కూడా వారికి పట్టదు. సాధారణ వస్తుసేవల సుంకం బిల్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం పుణ్యమా అని శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నది. వాస్తవాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా సత్యాన్ని అణచిపెడుతున్నారు.
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో కలసి గడచిన గురువారం ఉమ్మడి విలేకరుల సమావేశంలో పాల్గొన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టు కనిపించారు. ఆయన చురుకైన మేధ అమెరికా అధ్యక్ష ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన పరిమిత డిమాండ్లకు అతీతంగానే ఆలోచిస్తున్నదని స్పష్టంగానే అనిపిస్తుంది. శ్వేత సౌధంలో రెండు దఫాలు కొలువైనప్పటికీ ఒబామా తాత్వికుడైన అమెరికా అధ్యక్షునిగా అవతరించలేకపోయారు. అయితే అధ్యక్షునిగా చివరి దశను పూర్తి చేసుకుంటున్న ఈ కాలంలో మాత్రం సుదీర్ఘకాలంగా అమెరికా రాజకీ యాలలో పూరించకుండా ఉండిపోయిన వెలితిని భర్తీ చేయబోతున్నారు. ఎన్నికైనవారు, కొన్ని విపరీత మినహాయింపులు కాకుండా- తెలివైనవారే అయి ఉంటారు. కానీ వీరిలో కొద్దిమంది మాత్రమే మేధావులు. ఒబామా త్వరలోనే అమెరికాకు చెందిన పిన్న వయస్కుడైన పెద్ద రాజనీతిజ్ఞుడు కాబోతున్నారు.
ఇందుకు సంబంధించిన రుజువు ఈ విలేకరుల సమావేశంలోనే కనిపించింది. ఎన్నికల ప్రచారంలో అరుపులూ, కేకలతో హడావిడి చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైతే, అమెరికా- కెనాడా సంబంధాలు ఎలా ఉంటాయి అని ఒక విలేకరి ప్రశ్నించాడు. ఇప్పటికే ఈ అంశం మీద అమెరికాలో ఒక చతురోక్తి బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఆ పరిస్థితే వస్తే కెనడా అమెరికాకు మరోసారి అద్భుతమైన వలసగా మారు తుందన్నదే ఆ చతురోక్తి. అయితే రిపబ్లికన్‌ల అధ్యక్ష అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి, ట్రంప్ అవకాశాలు మెరుగుపడుతూ ఉండడంతో, ఈ చచ్చు చతురోక్తి కాస్తా, అమెరికావాసుల పాలిట పీడకల స్థాయికి చేరుతోంది.
ఒబామా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆలోచనకు కూడా రాని కొన్ని అంశాలు ఎందుకు ఎలా పరిగణించదగినవిగా ప్రాముఖ్యంలోకి వచ్చాయి? అధ్యక్ష పదవికి ఎన్నికైన నాటి నుంచి తాను ఏది చెప్పినా, ఏది చేసినా కూడా తప్పే అన్నట్టు రిపబ్లికన్ పార్టీ నిరాఘాటంగా ప్రతికూల ప్రచారం చేయడమే ఇందుకు కారణమని ఒబామా చెప్పారు. ఏ అంశాన్ని కూడా దానిలోని మంచిచెడ్డల మేరకు పరిశీలించలేదు. తాను ఏం చేసినా అది తప్పే. ఒబామాకు ముందు అధ్యక్షులైన వారు కూడా విమర్శలను ఎదుర్కొనకపోలేదు. కానీ వారిలో ఎవరూ ఇలా పరాయి ముద్రతో బాధపడలేదు. ఒబామా ‘ద్వేషం’ అన్న మాటను ఉపయోగించలేదు. కానీ ఆ అర్థం స్ఫురించే విధంగానే మాట్లాడారు. అలాగే ఆయన జాతి గురించిన ప్రస్తావన కూడా చేయలేదు. అయితే తనను ‘ఆక్రమణదారుడు’గానే భావించారన్నట్టు నర్మగర్భంగా చెప్పారు. అసలు ఒబామా అధ్యక్షునిగా ఎన్నికైన వాస్తవాన్ని జీర్ణించుకోవడమే అసాధ్యం అన్న రీతిలోనే రిపబ్లికన్లు కనిపించారు. వాళ్లు అబద్ధాలను ఆయుధాలుగా ఉపయోగించారు. ఆఖరికి ఆయన జన్మ ధృవీకరణ పత్రం గురించి కూడా కట్టుకథలు అల్లారు. వేలం వెర్రితో ఇలాంటి దుష్ర్పచారానికి పాల్పడిన బృందానికి నాయకుడు ట్రంప్. ఒబామా రెండురకాలుగా బయటి వ్యక్తి అన్నట్టు సూచించారు. ఎలాగంటే - మొదటిది- ఆయన అమెరికన్ కాదు, రెండోది - ఆయన మహమ్మదీ యుడు. ఉద్యోగాలంటూ వస్తున్న మెక్సికన్లు, యుద్ధమంటున్న మహ మ్మదీయులు అమెరికాకు ‘‘ప్రమాదకరంగా’’ పరిణమించిన నేపథ్యంలో అధ్యక్ష అభ్యర్థిత్వం ట్రంప్‌కు దక్కడం యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేం.
అయితే ఈ మతిభ్రమించిన వాచాలత్వాన్నీ, అవాస్తవాలను అమెరికన్లు విశ్వసించలేదు. అందుకే ఒబామా రెండోసారి కూడా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించారు. కానీ చాలామంది రిపబ్లికన్లు ఈ ధోరణిలోనే వ్యవహరించారు. అందుకే వారు ఇంత వికృతంగా, ఇంత దుస్సాహసంతో మాట్లాడుతున్నప్పటికీ ట్రంప్ అభ్యర్థిత్వం వైపు మొగ్గారు. ఇప్పుడు నమ్మకం కుదరక రిపబ్లికన్ పార్టీ తనను తను గిల్లుకుని చూసుకుంటోంది. అయినా వాస్తవం ఏమిటంటే, ట్రంప్ వారి సృష్టే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవ రిైైనైనా వెర్రి రాజకీయాలు ఊరిస్తూనే ఉంటాయి. కానీ అసభ్య పిల్లచేష్టలతో ఎవరూ మనుగడ సాధించలేరు.
ఇలాంటి వేలం వెర్రి ప్రతికూల ప్రచారాలు తిరిగి తమకే చేటు చేస్తాయని మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందా? ప్రధాని నరేంద్ర మోదీ మీద ఆ పార్టీ అవిశ్రాంతంగా సాగిస్తున్న ప్రతికూల ప్రచా రంలో ఉద్వేగమే తప్ప, హేతువు లేదు. ఆ విమర్శలన్నీ వ్యక్తిగతమైనవే. మోదీ ప్రతిపాదించినది ఏదైనా సరే, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆఖరికి తాను ప్రతిపాదించినది గతంలో యూపీఏ అధికారంలో ఉండగా చేసిన దేనని మోదీ చెప్పినా కూడా వారికి పట్టదు. సాధారణ వస్తుసేవల సుంకం బిల్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం పుణ్యమా అని శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నది. వాస్తవాల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా సత్యాన్ని అణచిపెడుతున్నారు.
తాజాగా జరిగిన ఉదంతాన్నే తీసుకుందాం. ఈ ఘట్టంలో అపఖ్యాతిని మూటగట్టుకున్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యా దేశం నుంచి పారిపోవడానికి కారణం ప్రస్తుత ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఇందులో గమనించవలసిన సున్నితమైన సత్యం ఏమిటంటే, మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ అనే మునిగిపోతున్న విమానయాన సంస్థకు కాంగ్రెస్ అధి కారంలో ఉండగానే ప్రభుత్వ బ్యాంకుల నుంచి నిధులు కుమ్మరించేందుకు అనుమతి లభించింది. ఫిబ్రవరి 21, 2012న ఎస్‌పీఎస్ పన్ను, సంజయ్ సింగ్ అనే ఇద్దరు పత్రికా రచయితలు రాసిన నివేదిక నుంచి ఇక్కడ ఒక అంశాన్ని ఉదహరిస్తున్నాను. భారతీయ స్టేట్ బ్యాంక్ ‘‘విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ మునిగిపోకుండా కాపాడడానికి మంగళ వారం రూ. 1500 కోట్లు విసిరింది. ఆదాయ పన్ను శాఖ కూడా తన విధా నాన్ని సరళం చేసుకుంది. నష్టాలలో ఉన్న ఆ సంస్థను కాపాడేందుకు ప్రకటించిన ఆర్థిక ప్రణాళికలో భాగంగా స్తంభింప చేసిన ఆ విమానయాన సంస్థ ఖాతాలు తిరిగి చెలామణిలోకి రావడానికి అంగీకరించింది.’’ మాల్యాకు ప్లాటినమ్ చెమ్చాతో అన్నీ నోటికందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఆయన మీద చర్యలు మొదలైనది నిజానికి ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే. ప్రస్తుత వ్యవస్థను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇంక ఏమాత్రం సాధ్యం కాదని తెలుసుకున్న తరువాతే మాల్యా హడావిడిగా దేశం విడిచి వెళ్లారు. అతడి మీద చర్యలకు బ్యాంకులకు కూడా ఆదేశాలు వెళ్లాయి. ఇక్కడితో ఈ కథ అయిపోయిందని అనుకోవద్దు. చట్టం దృష్టి చాలా విస్తృతమైనది. మాల్యా ఆచూకీ తెలిసి, హాజరు కావలసిన తేదీకి అతడు కోర్టుకు రాని పక్షంలో ఈ దృష్టిని ప్రభుత్వం కాపాడగలిగితే దాని విస్తృతికి లోటుండదు.
ఒబామా ప్రత్యేకంగా చెప్పినట్టు, అసలు బాధ అమెరికా తన విలువలు, ఇంగిత జ్ఞానం- ఈ రెండింటినీ కోల్పోవడం గురించినది కాదు. రిపబ్లికన్ పార్టీ తనకు తాను చేసుకున్న గాయాల నుంచి కోలుకుంటుందా లేదా అన్నదే. ప్రజాస్వామ్యంలో విశ్వసనీయమైన ప్రభుత్వం ఎంత అవసరమో, పొందికైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ఒక సామెత చెబుతారు, దేవతలు కాలు మోపడానికి కూడా భయపడే చోటికి అవివేకులు వెళతారట. అయితే ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి ఏమిటంటే, అక్కడ అవివేకులు కూడా అభ్యర్థులవుతారు. కానీ ఓటర్లు అంత దయకలిగిన వారేమీ కాదు. కానీ మూర్ఖులను సంతోషంగా భరిస్తున్న రాజకీయ పార్టీలు మాత్రం విశ్వసనీయత విషయంలో చాలా మూల్యం చెల్లించవలసి ఉంటుంది.
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి