
ఒబామా నడిచొస్తే..!
వాషింగ్టన్: ఒబామా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు.. అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు... చుట్టూ అంగరక్షకులతో.. బుల్లెట్‌ప్రూఫ్ కారులో ప్రయాణించే ఆయన తన కార్యాలయం వైట్‌హౌజ్‌కు ఒక సామాన్యుడిలా నడిచి వచ్చి ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రొటోకాల్‌ను కాదనుకొని సమీపంలోని యూ.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ది ఇంటీరియర్ నుంచి వైట్‌హౌజ్‌కు నడుచుకుంటూ వెళ్లారు. మార్గం మధ్యలో తారసపడిన యాత్రికులు, పిల్లలు, దుకాణదారులను పలకరించారు. ఓ మహిళ అయితే ఇదంతా చూసి షాక్‌కు గురైంది. ఇది నిజమేనా అంటూ ఒబామానే ప్రశ్నించింది. మరికొందరు అధ్యక్షుడితో కలసి ఫొటోలు కూడా దిగారు.