అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఏడు వామపక్షాలు పిలుపునిచ్చాయి.
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఏడు వామపక్షాలు పిలుపునిచ్చాయి. సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్, ఎస్‌యూసీఐ (సీ), ఎంసీపీఐ (యూ), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌ల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల స్థూపం నుంచి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు నిరసన తెలపనున్నారు. ఒబామా పర్యటన సందర్భంగా దేశానికి నష్టం కలిగించే 63 ఒప్పందాలపై గతంలో ఉన్న నిబంధనలను తొలగించే కుట్ర జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.