అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి.
హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్, ఎస్‌యూసీఐ (సీ), ఎంసీపీఐ (యూ), సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌ల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బషీర్‌బాగ్ విద్యుత్ అమరవీరుల స్థూపం నుంచి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్నివారు ముట్టిడించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నేత నారాయణ, తదితరులు పాల్గొన్నారు. పలు కార్యకర్తలతో పాటు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఒబామా రాకను వ్యతిరేకిస్తూ న్యూడెమెక్రసీ నాయకులు ఆయన దిష్టిబొమ్మను రాంనగర్ చౌరస్తాలో దహనం చేశారు.