అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను భారత్‌కు ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోదీ దేశ సార్వభౌమాధికారాన్ని సామ్రాజ్యవాదానికి తాకట్టుపెట్టారని..
26న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను భారత్‌కు ఆహ్వానించడం ద్వారా ప్రధాని మోదీ దేశ సార్వభౌమాధికారాన్ని సామ్రాజ్యవాదానికి తాకట్టుపెట్టారని సీపీఐ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విమర్శించారు. ఒబామా పర్యటనకు నిరసనగా జనవరి 26న భారత్ బంద్, తెలంగాణ రాష్ట్ర బంద్ పాటించాలని బుధవారం ఓ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.