ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం!
ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం!
Published Tue, Sep 23 2014 5:01 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో అమెరికాకు చెందిన ఆరు కంపెనీల సీఈవోలతో మోడీ సమావేశమవుతారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఈనెల 27న ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వసభ్య సమావేశంలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 29, 30 తేదిల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నరేంద్రమోడీ భేటీ అవుతారు.
Advertisement
Advertisement