వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దక్షిణాసియాకు చెందిన మరో వ్యక్తిని కీలక పదవికి నామినేట్ చేశారు. భారత సంతతి మహిళ ఇందిరా తల్వానీని మసాచుసెట్స్ జిల్లా జడ్జిగా నియమించారు. ఫస్ట్ సర్క్యూట్‌కు నామినేట్ అయిన తొలి సౌత్ ఏషియా మహిళ ఇందిరానే. ఆమె ప్రస్తు తం బోస్టన్‌లోని సీగల్‌రోయిట్‌మాన్‌లో భాగస్వామిగా పనిచేస్తున్నారు. సివిల్ లిటిగేషన్ కేసుల్లో రాష్ట్ర, ఫెడరల్ ట్రయల్ కోర్టుల్లో ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు.
1988లో ఉత్తర కాలిఫోర్నియా జిల్లా కోర్టు జడ్జి స్టాన్లీ ఏ వెజైల్ దగ్గర లా క్లర్క్‌గా ఇందిరా లీగల్ కెరీర్‌ను ఆరంభించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. కాగా, ఒబామా నామినేట్ చేసిన దక్షిణాసియాకు చెందిన వారిలో ఇందిరా మూడో వ్యక్తి కావడం విశేషం. గతంలో దక్షిణాసియాకు చెంది న విన్స్ ఛాబ్రియాను ఉత్తర కాలిఫోర్నియా జిల్లా జడ్జిగా, మనీష్ షాను ఉత్తర ఇల్లినాయిస్ జిల్లా జడ్జిగానూ ఒబామా నియమించిన విషయం తెలిసిందే.
మసాచుసెట్స్ జడ్జిగా భారత సంతతి మహిళ
Published Thu, Sep 26 2013 1:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement