29, 30 తేదీల్లో ఒబామాతో మోడీ భేటీ | Barak Obama,Narendra Modi to meet on Sept 29-30, expand strategic partnership | Sakshi
Sakshi News home page

29, 30 తేదీల్లో ఒబామాతో మోడీ భేటీ

Published Wed, Sep 10 2014 2:15 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Barak Obama,Narendra Modi to meet on Sept 29-30, expand strategic partnership

వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 29, 30 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో శ్వేతసౌధంలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన అనేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.
 
 మోడీతో ఒబామా రెండురోజులపాటు సమావేశం కావాలని నిర్ణయించడం.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అమెరికా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి నిదర్శనమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. తొలిసారిగా మోడీ, ఒబామాల మధ్య జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఇరువురు నేతలు ఈనెల 29, 30 తేదీల్లో భేటీ అవుతారని శ్వేతసౌథం ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement