Josh Earnest
-
‘హాట్‌లైన్ కొనసాగుతుంది’
వాషింగ్టన్: భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు నేరుగా సంభాషించుకునేందుకు 2015లో బరాక్ ఒబామా పాలనలో ఏర్పాటు చేసిన హాట్‌లైన్, కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక కూడా కొనసాగుతుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కొత్తగా ఏర్పాటైన హాట్‌లైన్ ఇదొక్కటే కావడం గమనార్హం. 2015లో భారత గణతంత్ర వేడుకలకు ఒబామా అతిథిగా వచ్చారు. ఆ సమయంలో భారత ప్రధానితో హాట్‌లైన్ ఏర్పాటు చేయాలని ఒబామా నిర్ణయించారు. రష్యా, చైనా, బ్రిటన్, భారత్‌లకు మాత్రమే ఇప్పటివరకు శ్వేతసౌధంలో హాట్‌లైన్ ఉంది. హాట్‌లైన్ ఏర్పాటయ్యాక ఒబామా, మోదీ ఓసారి గంటకు పైగా మాట్లాడుకున్నట్టు భారత్‌లో అమెరికా రాయబారి వెల్లడించారు. -
‘భారత్, అమెరికా కలిస్తే అద్భుతాలే’
వాషింగ్టన్: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా పరస్పరం సహకరించుకుంటే ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని వైట్‌హౌస్ పేర్కొంది. ఇది ఆ రెండు దేశాలకే కాక మొత్తం ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపింది. లావోస్‌లో 14వ భారత్–ఆసియాన్ సదస్సు, 11వ తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమైన వారం తర్వాత వైట్‌హౌస్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జోష్ ఎర్నెస్ట్ విలేకరులతో మాట్లాడుతూ.. అనేక కీలకాంశాలపై కలసి పనిచేసే అవకాశం ఇరు దేశాలకు ఉందని చెప్పారు. పారిస్ వాతావరణ ఒప్పందంపై ఏకాభిప్రాయం సాధించే విషయంలో అంతర్జాతీయంగా అనేక సందేహాలు వచ్చాయని, అయితే భారత్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడంతో దానిపై ఏకాభిప్రాయం వచ్చిందని తెలిపారు. ఇది ప్రధాని మోదీ సాధించిన ఘనత అని, వాతావరణ ఒప్పందంపై ఒబామాతో పాటు ప్రపంచ దేశాల అధినేతలతో నిరంతరం మోదీ సంప్రదింపులు జరపడం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. భారత, అమెరికా సంబంధాలు మోదీ, ఒబామా నాయకత్వంలో మరింత బలోపేతం కావడాన్ని అమెరికా అధ్యక్షుడు గర్వంగా భావిస్తున్నారని చెప్పారు. -
లాడెన్ ఆల్‌ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆ సంస్థ పేరు మార్చాలనుకుంటున్నారా ? అంటే అవుననే అంటున్నాయి అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వర్గాలు. యూఎస్ సైన్యం చేతిలో లాడెన్ హతమయ్య కొద్ది రోజుల మందు.. ఆల్ ఖైదా సంస్థ పేరు మార్చాలని భావించాడని.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నిస్ట్ బుధవారం వాషింగ్టన్లో వెల్లడించారు. యూఎస్‌లో డబ్ల్యూటీసీ టవర్‌పై దాడి చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విధ్వంసానికి పాల్పడటంతో లాడెన్ ఆలోచనలో పడ్డాడు. అల్ ఖైదా మారణహోమానికి ప్రతీకగా నిలిచిందని లాడెన్ భావించాడు. ఇలాగే విధ్వంసం సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఖైదాకు మరింతచెడ్డ పేరు వస్తుందని అనుకున్నాడు. ఆ క్రమంలో ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడు... అది కూడా ఇస్లాం మాతానికి చాలా దగ్గరగా ఉండేలా కొత్త పేరు పెట్టాలనుకున్నాడు. ఆ దిశగా ఆలోచనలు చేస్తూ...ఆల్‌ఖైదా నాయకులతో సమాలోచన చేసేందుకు చర్యలు కూడా చేపట్టాడని ఎర్నెస్ట్ వివరించారు. ఇంతలో లాడెన్ పాకిస్థాన్ అబోటాబాద్‌లోని బిలాల్ పట్టణంలో ఉన్నట్లు గుర్తించిన యూఎస్ సైన్యం... 2011, మే 2వ తేదీన అతడి నివాసంపై దాడి చేసి... అతడ్ని అంతమెందించింది. అనంతరం అతడి మృతదేహాన్ని యూఎస్ సైన్యం సముద్రంలో పడి వేసిన విషయం విదితమే.అయితే లాడెన్‌ను చంపేసిన తర్వాత అతడి నివాసంలో యూఎస్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో పలు కీలకమైన పత్రాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ పత్రాలను పరిశీలించిన యూఎస్ ఉన్నతాధికారులకు పలు ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. -
29, 30 తేదీల్లో ఒబామాతో మోడీ భేటీ
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 29, 30 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో శ్వేతసౌధంలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు అవసరమైన అనేక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. మోడీతో ఒబామా రెండురోజులపాటు సమావేశం కావాలని నిర్ణయించడం.. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అమెరికా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చెప్పడానికి నిదర్శనమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. తొలిసారిగా మోడీ, ఒబామాల మధ్య జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ, ఇరువురు నేతలు ఈనెల 29, 30 తేదీల్లో భేటీ అవుతారని శ్వేతసౌథం ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.