ఇస్లామాబాద్: భారత ప్రధాని మన్మో„హన్ సింగ్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలపై రేగిన వివాదానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తెరదించారు. తాను మన్మో„హన్‌ను ఎన్నడూ ‘పల్లె మహిళ’(దెహతీ ఔరత్) అని అనలేదని లండన్‌లో విలేకర్లతో అన్నారు. ఈమేరకు పాక్ పత్రికలు మంగళవారం వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ సందర్భంగా మన్మో„హన్ పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పిన నేపథ్యంలో.. నవాజ్ ఓ ఇంటర్వ్యూలో మన్మో„హన్ పల్లె మహిళలా ఫిర్యాదు చేశారని అన్నట్లు వార్తలు రావడం తెలిసిందే.