ఒబామాకు ఖరీదైన అతిథి... మన్మోహన్ | Barack Obama's dinner for Manmohan Singh the most expensive since 2009: report | Sakshi
Sakshi News home page

ఒబామాకు ఖరీదైన అతిథి... మన్మోహన్

Feb 15 2014 3:04 AM | Updated on Sep 2 2017 3:42 AM

ఒబామాకు ఖరీదైన అతిథి... మన్మోహన్

ఒబామాకు ఖరీదైన అతిథి... మన్మోహన్

అగ్రరాజ్యం అమెరికా... తాను విదేశీ నాయకులకిచ్చే విందుల విషయంలోనూ ఏమాత్రం తగ్గట్లేదు. అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి ఐదుగురు అత్యంత ప్రముఖ నేతలకు ఇచ్చిన విందుల వ్యయమెంతో తెలుసా?

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా... తాను విదేశీ నాయకులకిచ్చే విందుల విషయంలోనూ ఏమాత్రం తగ్గట్లేదు. అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి ఐదుగురు అత్యంత ప్రముఖ నేతలకు ఇచ్చిన విందుల వ్యయమెంతో తెలుసా? దాదాపు రూ. 9.62 కోట్లు. అందులో సింహభాగం అంటే రూ. 3.55 కోట్లు ఖర్చుతో విందు ఇచ్చింది ఎవరికో తెలుసా? మరెవరికో కాదు భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు.
 
  సమాచార హక్కు కింద సీబీఎస్ న్యూస్ 13 నెలల క్రితం చేసిన విన్నపానికి అమెరికా విదేశాంగ ఇచ్చిన గణాంకాలే ఇందుకు సాక్షి. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదట పర్యటనకొచ్చిన విదేశీ నేత అయిన మన్మోహన్‌సింగ్‌కు 2009, నవంబర్ 24న ఘనంగా విందు ఇచ్చారు. ఇందుకైన ఖర్చు 5.72 లక్షల డాలర్లు అంటే దాదాపు 3.55 కోట్ల రూపాయలు. అంతేకాదు ఇలా ఒబామా నుంచి అత్యంత ఖరీదైన విందు పొందిన తొలి ఐదుగురు విదేశీ నేతల్లో మన్మోహనే అగ్రస్థానంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement