
చింతామణి: మానవత్వమా నువ్వెక్కడ అని సభ్యసమాజం తలదించుకొనే ఘటన ఇది. బిడ్డ ఇష్టం లేకపోతే ఏ కూడలిలోనో గుట్టుగా వదిలివెళ్తే కారుణ్యమూర్తులు పోషిస్తారు. కానీ, అప్పుడే పుట్టిన ఆడశిశువును మరుగు దొడ్డి కిటికీకి తాడుతో ఉరి వేశారు గుర్తు తెలియని కిరాతకులు.
కర్ణాటకలో చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. శనివారం ఉదయం ఆస్పత్రి కార్మికుడు మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వెళ్లగా కిటికీ సిమెంటు దిమ్మెలకు శిశువు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వైద్యులకు చెప్పగా పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో ప్రసవమైన వారి వివరాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment