
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): ఫేస్‌బుక్‌లో గీతా సెక్సీ పేరుతో ఉన్న ప్రొఫైల్ నిజమని నమ్మిన కనకపురకు చెందిన యువకుడు సైబర్ నేరస్తుల మాయలో పడి రూ.41 లక్షలు పొగొట్టుకున్న సంఘటన వెలుగు చూసింది. కనకపుర నివాసి రాజేశ్ రూ.41 లక్షలు సమర్పించుకున్న బాధితుడు. కొన్ని రోజుల క్రితం రాజేశ్‌కు గీతా సెక్సీ పేరుగల ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.
తన పేరు గీత అని చెప్పిన సైబర్ నేరస్తుడు బెంగళూరు, రామనగర, శివమొగ్గ తదితర జిల్లాల్లో ఎస్కార్ట్ సర్వీస్‌లు ఇస్తానని, నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన రాజేశ్ తన పర్సనల్ విషయాలు ఫోటోలు షేర్ చేసాడు. కొన్ని రోజులకు అపరిచిత వ్యక్తి ఫొటోలు, వివరాలు తీసుకుని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. పలు దఫాలుగా మొత్తం రూ.41 లక్షలు తన ఖాతాలోకి వేయించుకున్నాడు. దీంతో బాధితుడు రామనగర సెన్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
Comments
Please login to add a commentAdd a comment