
ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఒక మహిళ తన ఆరునెలల పిల్లాడిని ఎత్తుకొని అహ్మదాబాద్(గుజరాత్)లోని పరీక్షాకేంద్రానికి వచ్చింది. ఇంకొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం అవుతుందనగా పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు.
ఎంతకీ ఏడుపు ఆపడం లేదు.
‘వెనక్కి తిరిగి పోవాలా? పరీక్ష రాయాలా?’ అనే డైలామాలో ఉన్నప్పుడు ‘నేనున్నాను’ అంటూ సీన్‌లోకి వచ్చింది కానిస్టేబుల్ దయాబెన్.
‘అక్కా, నేను పిల్లాడిని చూసుకుంటాను. నువ్వెళ్లి హాయిగా పరీక్ష రాయ్’ అని చెప్పింది. ఆ పిల్లాడి తల్లి దయాబెన్‌కు థ్యాంక్స్ చెప్పి ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లింది.
దయాబెన్ తన హావభావాలతో పిల్లాడిని ఏడుపు నుంచి నవ్వుల్లోకి జంప్ చేయించింది. ‘నన్ను నవ్వించినందుకు థ్యాంక్స్’ అని పిల్లాడు దయాబెన్ కళ్లలోకి చూస్తూ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు ట్విట్టర్‌లో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ దయాబెన్ దయాగుణాన్ని నెటిజనులు వేనోళ్ల పొగిడారు.
Comments
Please login to add a commentAdd a comment