child cry
-
‘పాపం.. ఆ పసి మనసుకేం తెలుసు!’
Viral Story: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కథనాలకు తలాతోక ఉండదు. నిజనిర్ధారణ(Fact Check) చేసుకోకుండా పోస్టులు పెడుతుంటారు కొందరు. అలాగే.. ఆ పోస్టుల ఆధారంగా మీమ్స్ సైతం వస్తున్న రోజులివి. తాజాగా సిసింద్రీ క్లైమాక్స్‌ను గుర్తు చేస్తోందంటూ ఓ ఘటన నెట్టింట హల్చల్ చేస్తోంది.వైరల్ వీడియోలో ఏముందంటే..పోలీస్ స్టేషన్లో.. ఓ వ్యక్తి చెర నుంచి రెండేళ్ల ఓ చిన్నారిని విడదీస్తారు పోలీసులు. ఆ టైంలో ఆ చిన్నారి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుంటాడు. అయినా పోలీసులు బలవంతంగా లాక్కుంటారు. ఆ చిన్నారి ఏడుపుతో పాటు కిడ్నాపర్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా ఆ బిడ్డను బయటకు తీసుకెళ్లాక.. ఓ మహిళకు అప్పగిస్తారు. ఆమెతో పాటు ఓ వ్యక్తి, వృద్ధజంటను ఆ బాలుడి గురించి ఆరా తీస్తారు. అయినా ఆ చిన్నారి లోపల ఉన్న కిడ్నాపర్ కోసం గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటాడు.Jaipur- A #child who was #kidnapped at 11 months old and kept with the kidnappers for 14 months, hugged the kidnapper, Tanuj, and began crying loudly when he was finally #rescued.This emotional moment even brought tears to the eyes of the accused."pic.twitter.com/UUpAAspTfG— Chaudhary Parvez (@ChaudharyParvez) August 30, 2024అయితే ఆ బిడ్డకు అతనే తండ్రి అని, విడిపోయిన నేపథ్యంలో భార్య అతనిపై కేసు పెట్టిందని ఓ ప్రచారం జరుగుతోంది. అలాగే.. కిడ్నాపర్ మీద మమకారం పెంచుకుని అలా ఆ చిన్నారి ఏడ్చాడంటూ మరో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏది నిజమంటే..అసలు విషయం ఏంటంటే..ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు తనూజ్ చాహర్(33).ఆ వీడియోలో ఉన్న చిన్నారి పేరు పృథ్వీ. ఆగ్రాకు చెందిన తనూజ్ గతంలో అలీఘడ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశాడు. కారణం తెలియదుగానీ.. అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు. అయితే.. ఆ చిన్నారి తల్లి పూనమ్ చౌదరితో అతనికి పరిచయం ఉంది. ఈ క్రమంలో తనతో వచ్చేయాలని ఆమెపై ఒత్తిడి చేశాడతను. ఆమె ఒప్పుకోకపోవడంతో.. కోపం పెంచుకుని ఆమె 11 నెలల కొడుకును ఎత్తుకెళ్లాడు.అలా సుమారు 14 నెలలపాటు ఆ బిడ్డతో ఎవరికీ దొరక్కుండా తిరిగాడు తనూజ్. పోలీసుగా తనకు ఉన్న అనుభవం ఉపయోగించడంతో పాటు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గడ్డం పెంచుకుని తిరిగాడు. ఆ బిడ్డను తన బిడ్డగా అందరికీ చెప్పుకుంటూ.. మధుర, ఆగ్రా, బృందావన్.. అన్నిచోట్లా తిరిగాడు. యమునా నది తీరాన ఓ గుడిసె వేసుకుని తనను తాను ఓ సాధువుగా అందరినీ నమ్మించే యత్నం చేశాడు. చివరకు ఈ మధ్య అలీగఢ్‌లో అతని జాడను గుర్తించిన జైపూర్ పోలీసులు.. 8 కిలోమీటర్లపాటు ఛేజ్ చేసి పట్టుకున్నాడు.తల్లిదండ్రులకు దూరం చేసిన ఆ వ్యక్తితో ఏడాది పాటు ఉన్న పృథ్వీ.. ఇన్నాళ్లు తనని సాకినందుకు ఆ కిడ్నాపర్‌పైనే మమకారం పెంచుకుని రోదిస్తుండడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. -
అక్కా నేను చూసుకుంటా.. ఏడ్చిన పిల్లాడు ఎంచక్కా నవ్వాడు
ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఒక మహిళ తన ఆరునెలల పిల్లాడిని ఎత్తుకొని అహ్మదాబాద్(గుజరాత్)లోని పరీక్షాకేంద్రానికి వచ్చింది. ఇంకొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం అవుతుందనగా పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. ఎంతకీ ఏడుపు ఆపడం లేదు. ‘వెనక్కి తిరిగి పోవాలా? పరీక్ష రాయాలా?’ అనే డైలామాలో ఉన్నప్పుడు ‘నేనున్నాను’ అంటూ సీన్లోకి వచ్చింది కానిస్టేబుల్ దయాబెన్. ‘అక్కా, నేను పిల్లాడిని చూసుకుంటాను. నువ్వెళ్లి హాయిగా పరీక్ష రాయ్’ అని చెప్పింది. ఆ పిల్లాడి తల్లి దయాబెన్కు థ్యాంక్స్ చెప్పి ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లింది. దయాబెన్ తన హావభావాలతో పిల్లాడిని ఏడుపు నుంచి నవ్వుల్లోకి జంప్ చేయించింది. ‘నన్ను నవ్వించినందుకు థ్యాంక్స్’ అని పిల్లాడు దయాబెన్ కళ్లలోకి చూస్తూ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ దయాబెన్ దయాగుణాన్ని నెటిజనులు వేనోళ్ల పొగిడారు. -
పాల కోసం ఏడ్చి.. తనువు చాలించి..
ఆరునెలల పసిబాలుడి మృతి.. కాంట్రాక్టర్ పని ఒత్తిడి వల్లే పాలివ్వని తల్లి! హత్నూర: తల్లిపాల కోసం ఆరునెలల పసి బాలుడు ఏడ్చి.. ఏడ్చి తనువు చాలించాడు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మాతృమూర్తికి తీరని గర్భశోకం మిగిలింది. ఈ ఘటన మెదక్ జిల్లా హత్నూర మండలం తుర్కలఖానాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఓ పరిశ్రమలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామ శివారులో గల ఓ ప్రైవేటు రసాయన పరిశ్రమలో పనిచేసేందుకు కాంట్రాక్టర్ మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కాకర్లపాడుకు చెందిన కూలీలను తీసుకొచ్చాడు. వీరికి పరిశ్రమ ఆవరణలోనే గుడారాలను ఏర్పాటు చేశాడు. పనులు చేసేందుకు వచ్చిన వారిలో మల్లీశ్వరి అనే ఆమెకు ఆరు నెలల పసి బాలుడు ఉన్నాడు. రోజులాగే ఈ నెల ఏడున తన ఆరునెలల పసి బాలుడిని నివాసంలో పడుకోబెట్టి కుమార్తెను కాపలాగా ఉంచి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత నిద్రి లేచిన బాలుడు ఏడుస్తుండటంతో విషయాన్ని కుమార్తె.. తల్లి దృష్టికి తెచ్చింది. దీంతో మల్లీశ్వరి బిడ్డకు పాలు ఇచ్చి వస్తానని కాంట్రాక్టర్‌ను కోరినా అందుకాయన అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆ పసికందు ఏడ్చి ఏడ్చి తనువు చాలించాడు. కాంట్రాక్టర్ ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుం డా బాలుడిని నర్సాపూర్‌లోని ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి మల్లీశ్వరిని తన వెంట తీసుకెళ్లాడు. మధ్యలో ఏం జరిగిందో తెలియదు గానీ.. నర్సాపూర్‌లోని ఓ శ్మశానవాటికలో బాలుడి మృతదేహాన్ని పూడ్చి, ఆమెను సొంతూరుకు పంపినట్లు తెలిసింది. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని హత్నూర పోలీసులు తెలిపారు.