women conistable
-
అక్కా నేను చూసుకుంటా.. ఏడ్చిన పిల్లాడు ఎంచక్కా నవ్వాడు
ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఒక మహిళ తన ఆరునెలల పిల్లాడిని ఎత్తుకొని అహ్మదాబాద్(గుజరాత్)లోని పరీక్షాకేంద్రానికి వచ్చింది. ఇంకొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం అవుతుందనగా పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. ఎంతకీ ఏడుపు ఆపడం లేదు. ‘వెనక్కి తిరిగి పోవాలా? పరీక్ష రాయాలా?’ అనే డైలామాలో ఉన్నప్పుడు ‘నేనున్నాను’ అంటూ సీన్లోకి వచ్చింది కానిస్టేబుల్ దయాబెన్. ‘అక్కా, నేను పిల్లాడిని చూసుకుంటాను. నువ్వెళ్లి హాయిగా పరీక్ష రాయ్’ అని చెప్పింది. ఆ పిల్లాడి తల్లి దయాబెన్కు థ్యాంక్స్ చెప్పి ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లింది. దయాబెన్ తన హావభావాలతో పిల్లాడిని ఏడుపు నుంచి నవ్వుల్లోకి జంప్ చేయించింది. ‘నన్ను నవ్వించినందుకు థ్యాంక్స్’ అని పిల్లాడు దయాబెన్ కళ్లలోకి చూస్తూ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ దయాబెన్ దయాగుణాన్ని నెటిజనులు వేనోళ్ల పొగిడారు. -
Viral Video: దొంగలతో మహిళా కానిస్టేబుళ్ల వీరోచిత పోరాటం
బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన దుండగులతో వీరోచితంగా పోరాడారు ఇద్దరు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు.. దొంగల పట్ల మహిళలు చూపిన ధైర్యం, తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలోని హాజీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెందూరి చౌక్‌లో ఉన్న ఉత్తర్ బిహార్ గ్రామీణ బ్యాంక్ వద్ద బ్యాంక్ వద్ద జుహీ కుమారీ, శాంతీ కుమారీ అనే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ముగ్గురు వ్యక్తులు బ్యాంక్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వాళ్ల ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో ఏ పనిమీద వచ్చారని జుహీ ప్రశ్నించింది. దీనికి వారు బ్యాంక్‌లో పని ఉందని చెప్పగా.. పాస్‌బుక్ చూపించమని అడిగింది. దీంతో ముగ్గురిలో ఓ వ్యక్తి రివాల్వర్ బయటకు తీశాడు. వెంటనే అప్రమత్తమైన ఇద్దరు కానిస్టేబుళ్లు తమ తుపాకులతో వారిని నిలవురించారు. కానిస్టేబుళ్ల వద్ద ఉన్న తుపాకులను లాక్కోవడానికి దొంగల విఫల ప్రయత్నం చేశారు. దొంగల చేతిలో గన్ ఉన్నప్పటికీ ఏమాత్రం భయపడలేదు. మహిళలిద్దరూ ముగ్గురు దుండగులపై సాహోసోపేతంగా పోరాడారు. అప్పటికే బ్యాంకులో దొంగతనం చేయడం కుదిరేలా లేదని భయపడ్డ దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది. పారిపోయిన దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దొంగలను ధైర్యంగా ఎదుర్కొని, తరిమికొట్టిన మహిళా కానిస్టేబుళ్లను బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని బ్యాంక్ దోపిడికి ప్రయత్నించిన నిందితుల కోసం గాలిస్తున్నారు. సెందూరి వద్ద ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారని.. తమ మహిళా కానిస్టేబుళ్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించి వారిని భయపెట్టగలిగారని సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.. ఈ ఘటనలో ఎలాంటి కాల్పులు జరగలేదని.. కానిస్టేబుళ్లకు రివార్డ్ అందిస్తామని పేర్కొన్నారు. చదవండి: దారుణం.. బైకర్‌ను ఢీకొట్టి 1.5 కిమీ ఈడ్చుకెళ్లిన ఆటో డ్రైవర్.. అరుస్తున్నా ఆపకుండా.. The Gallant act of two lady constables of Bihar Police is laudable. Their bravery thwarted an attempt of Bank Robbery in Vaishali.#Bihar_Police_Action_against_Criminal pic.twitter.com/M3Nn9w33Xw — Sawant Suman ساونت سمن 🇮🇳💙 (@SumanSawant) January 19, 2023 -
ఉమెన్స్ డే: ఆమె కానిస్టేబుల్ కాదు.. హోం మంత్రి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళా కానిస్టేబుల్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో మీనాక్షి వర్మ అనే కానిస్టేబుల్‌కు ఒకరోజు హోంమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మీనాక్షిని మంత్రి మిశ్రా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన చైర్‌ను ఓ రోజు పాటు కానిస్టేబుల్ మీనాక్షి వర్మకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఒక్కరోజు(సోమవారం) హోంశాఖ పూర్తిగా మీనాక్షి ఆదేశాల మేరకే పని చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం సమస్యలు తెలపటానికి వచ్చిన ప్రజల నుంచి మీనాక్షీ వర్మ పలు వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజా సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు అక్కడ మంత్రి కూర్చునే స్థానంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. మహిళా దినోత్సవం రోజున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని మీనాక్షి అన్నారు. తాను హోంమంత్రిగా పనిచేసే అవకాశం తనకు దక్కుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు మీనాక్షి హోమంత్రి కార్యాలయంలోనే సెక్యూరిటీ విధుల్లో ఉంటున్నారు. చదవండి: రాజస్తాన్ కమలంలో వర్గపోరు ! ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్ Madhya Pradesh: Woman constable Meenakshi Verma took charge as state home minister for a day today. "I have given my chair to Meekankshi for the day on the occasion of #InternationalWomensDay," State Home Minister Narottam Mishra says. pic.twitter.com/zBD722giKd — ANI (@ANI) March 8, 2021 -
మహిళా కానిస్టేబుల్‌తో రవీంద్ర జడేజా వాగ్వాదం
గాంధీనగర్ : భారత క్రికెట్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాజ్‌కోట్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగినట్లు మంగళవారం గుజరాత్ పోలీసులు తెలిపారు. వివరాలు.. జడేజా తన భార్య రివిబాతో కలిసి సోమవారం రాత్రి 9. గంటల సమయంలో కారులో వెళ్తుండగా వీరి వాహనాన్ని తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్ సోనాల్ గోసాయ్ అడ్డగించారు. కారు డ్రైవింగ్ సీట్లో జడేజా మాస్క్ ధరించి ఉన్నప్పటికీ అతని భార్య మాస్క్ ధరించలేదు. దీంతో ఎందుకు మాస్క్ ధరించలేదని ప్రశ్నించడంతోపాటు జరిమానా చెల్లించాలని మహిళా పోలీస్ ఆదేశించింది. దీంతో రవీంద్ర జడేజాకు కానిస్టేబుల్‌కు మధ్య వాదన పెరిగి వాగ్వాదానికి దిగినట్లు, మరోవైపు రివిబా కూడా ఆమెతో దురుసుగా ప్రవర్తించినట్లు డీసీపీ మనోహర్ సింగ్ తెలిపారు. (నెలలో 16.2 లక్షల సార్లు) అయితే తమ ప్రాథమిక దర్యాప్తులో జడేజా భార్య రవిబా మాస్క్ ధరించలేదని వెల్లడైందని పోలీసులు తెలిపారు. అసలు వీరి మధ్య గొడవ ఎందుకు పెద్దదయ్యిందనే విషయంపై దర్యాప్తు జరుగుతుందని వివరించారు. కాగా ఇద్దరి మధ్య ఘర్షణ అనంతరం మహిళా కానిస్టేబుల్ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కుదుట పడిందని ఇప్పుడు డిశ్చార్జి అయినట్లు వెల్లడించారు. అంతేగాక ఇటు జడేజా నుంచి అటు కానిస్టేబుల్ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. ('ఆరోజు సచిన్ నక్కతోకను తొక్కాడు') -
మహిళా పోలీసులను నిర్భంధించిన చింతమనేని అనుచరులు
సాక్షి, ఏలూరు టౌన్ : మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను బుధవారం అరెస్ట్ చేసే సందర్భం లో చింతమనేని ఇంటి వద్ద విధులు నిర్వర్తిసు న్న మహిళా కానిస్టేబుళ్లను కొందరు నిర్బంధించి, విధులకు ఆటంకం కలిగించి, బెదిరిం పులకు పాల్పడ్డారు. దీనిపై మహిళా కానిస్టేబు ల్ గుమ్మడి మేరీ గ్రేస్ ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయ్యిం ది. ఈ కేసుకు సంబంధించి ఏలూరు డీఎస్పీ దిలిప్‌కిరణ్ ఆధ్వర్యంలో చింతమనేని వర్గీ యులు నలుగురిని త్రీటౌన్ పోలీసులు గురువారం అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు మహిళా పోలీసులను అక్కడ కొందరు చింతమనేని వర్గీయులు నిర్బంధించి, బెదిరింపులకు పాల్పడ్డారని, గేటుకు తాళాలు వేసి, విధులకు ఆటంకం కలిగించారని తెలిపారు. ఈ సంఘటనపై సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, ఇంకా ఎవరైతే ఉంటారో వారందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో క్రైం నెంబర్ 291/19తో కేసు నమోదు అయ్యిందని తెలిపారు. ఈ కేసులో జెడ్పీలో పనిచేస్తున్న దుగ్గిరాల గ్రామానికి చెందిన చింతమనేని విష్ణు, ధర్మాజీగూడెంకు చెందిన వేంపాటి ప్రసాద్, ఏలూరుకు చెందిన న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్, పెదవేగి మాజీ ఎంపీపీ దేవరపల్లి బక్కయ్యను అరెస్టు చేశారు. అనంతరం మధ్యాహ్నం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టుకు హాజరుపరిచారు. వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. టీడీపీ ప్రజాప్రతినిధుల హడావుడి చింతమనేని అనుచరులు నలుగురుని అరెస్టు చేశారనే విషయం తెలుసుకున్న టీడీపీ మాజీ ప్రజాప్రతినిధులు బడేటి కోటరామారావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను ఏలూరులోని త్రీటౌన్ స్టేషన్ వద్దకు వచ్చారు. అప్పటికే అరెస్టు కాబడి స్టేషన్లో ఉన్న వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదంటూ బీరాలు పలికారు. కార్యకర్తల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసి వచ్చామని, ఆయన బాగానే ఉన్నారని చెప్పారు. -
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
-
మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్‌ను తోటి కానిస్టేబుల్ కిరాతంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో సోమవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న ప్రకాష్, మందాకిని గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ప్రకాశ్‌కు ఇంతకు ముందే వేరే అమ్మాయితే పెళ్లి అయినప్పటికి మందాకినితో వివాహేతర సంబంధం కొనసాగించాడు. మొదటి పెళ్లి విషయం తెలుసుకున్న మందాకిని తనను కూడా వివాహం చేసుకోవాలని గట్టిగా నిలదీసింది. దీంతో ఆమెను వదిలించుకోవడానికి ప్రకాష్ కుట్ర పన్నాడు. పథకం ప్రకారం మందాకినిని నమ్మించి గత నెల 29న బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి చంపాడు. అనంతరం మృతదేహాన్ని తన కారులో సదాశివపేట మండలం కొనపూర్ గ్రామ శివారుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మందాకిని తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టాగా ఈ విషయం బయటపడింది. ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకొని మరిన్నివివరాల కోసం విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. -
కానిస్టేబుల్ కూతురిని రేప్ చేసిన డీసీపీ
ఔరంగాబాద్: మహిళకు రక్షణ కరువైన దేశంలో రక్షకభటుడే కీచకుడిగా మారిన వ్యవహారం ఇంకాస్త ఆందోళన కలిగిస్తున్నది. తన వద్ద పనిచేస్తోన్న కానిస్టేబుల్ కూతురికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ).. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎండీసీ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. దర్యాప్తు అధికారి డీసీపీ వినాయక్ ధక్నే తెలిపిన వివరాలివి... తీవ్రంగా హింసించాడు: ఔరంగాబాద్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న మహిళకు 23 ఏళ్ల కూతురుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్ శ్రీరామ్‌ను అభ్యర్థించిందా మహిళా కానిస్టేబుల్. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. అంతటితో ఊరుకోకుండా నెలల తరబడి ఆమెను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అతని హింస తారాస్థాయికి చేరడంతో బాధితురాలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీసీపీ రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖలో కలకలం.. సెలవులో డీసీపీ: మహిళా కానిస్టేబుల్ కూతురిపైనే ఉన్నతాధికారి అకృత్యానికి పాల్పడటం మహారాష్ట్ర పోలీసు శాఖలో సంచలనం రేపింది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ‘‘బాధితురాలి ఫిర్యాదుమేరకు ప్రాధమిక దర్యాప్తు అనంతరం డీసీపీ రాహుల్ శ్రీరామ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశాం. ప్రస్తుతం అతను సెలవుపై వెళ్లిపోయాడు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించి, చార్జిషీటు దాఖలు చేస్తాం’’ అని దర్యాప్తు అధికారి వినాయక్ మీడియాకు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సిఉంది. -
నన్ను క్షమించు.. చేయి జారాను : ఎమ్మెల్యే
సాక్షి, షిమ్లా : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఆ పార్టీ నేత ఆశాకుమారి క్షమాపణలు చెప్పారు. అలా ఎందుకు తాను చేయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. అదే సమయంలో ఆ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆమె(మహిళా కానిస్టేబుల్) నన్ను తిట్టింది. నన్ను తోసింది. ఆమె నన్ను వెళ్లకుండా నిలువరించాల్సింది.. నాకు ఆమె తల్లికున్న వయసు ఉంటుంది. అయితే, ఈ సమయంలో నేను నా సహనాన్ని కోల్పోకుండా ఆగ్రహాన్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉండాల్సింది. నేను అందుకు క్షమాపణలు చెబుతున్నాను' అని మీడియా సాక్షిగా తెలిపారు. సమీక్ష సమావేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు షిమ్లాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాయలం దగ్గరకు ఆశాకుమారి చేరుకున్నారు. అయితే పోలీస్ సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా ఓ మహిళా కానిస్టేబుల్ చెంప పగలకొట్టారు. అయితే దానికి ప్రతిగా ఆ కానిస్టేబుల్ కూడా ఆమె చెంప వాయించింది. దీంతో ఆశాకుమారి ఆగ్రహంతో ఊగిపోగా.. కార్యకర్తలు ఆమెను పక్కకు తీసుకెళ్లారు. -
మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం
నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఇందిర (28) శుక్రవారం బలవన్మరణం చెందింది. నిజామాబాద్ రూరల్ మండలం న్యాలకల్ గ్రామానికి చెందిన ఆమెకు ఆరు నెలల క్రితం వివాహమైంది. భర్తతో తలెత్తుతున్న మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల కిందట విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో మనోవేదనకు గురైన ఆమె శుక్రవారం ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని చనిపోయింది. మనోవేదనతోనే ఇందిర ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.