takecare
-
అక్కా నేను చూసుకుంటా.. ఏడ్చిన పిల్లాడు ఎంచక్కా నవ్వాడు
ఇంట్లో చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో ఒక మహిళ తన ఆరునెలల పిల్లాడిని ఎత్తుకొని అహ్మదాబాద్(గుజరాత్)లోని పరీక్షాకేంద్రానికి వచ్చింది. ఇంకొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం అవుతుందనగా పిల్లాడు ఏడుపు లంకించుకున్నాడు. ఎంతకీ ఏడుపు ఆపడం లేదు. ‘వెనక్కి తిరిగి పోవాలా? పరీక్ష రాయాలా?’ అనే డైలామాలో ఉన్నప్పుడు ‘నేనున్నాను’ అంటూ సీన్లోకి వచ్చింది కానిస్టేబుల్ దయాబెన్. ‘అక్కా, నేను పిల్లాడిని చూసుకుంటాను. నువ్వెళ్లి హాయిగా పరీక్ష రాయ్’ అని చెప్పింది. ఆ పిల్లాడి తల్లి దయాబెన్కు థ్యాంక్స్ చెప్పి ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లింది. దయాబెన్ తన హావభావాలతో పిల్లాడిని ఏడుపు నుంచి నవ్వుల్లోకి జంప్ చేయించింది. ‘నన్ను నవ్వించినందుకు థ్యాంక్స్’ అని పిల్లాడు దయాబెన్ కళ్లలోకి చూస్తూ చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. కానిస్టేబుల్ దయాబెన్ దయాగుణాన్ని నెటిజనులు వేనోళ్ల పొగిడారు. -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ భీమారం (కేతేపల్లి) : వర్షాకాలంలో మూగజీవులకు వచ్చే వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ సూచించారు. మండలంలోని బీమారం గ్రామంలో ఆదివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాపించేందుకు నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూగజీవుల్లో రోగ లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్య సిబ్బందిని స్రందించించి చికిత్స చేయించాలన్నారు. ఈ సందర్భంగా 300 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోట ముత్తయ్య, స్థానిక సర్పంచ్ బడుగుల కవితనరేందర్, ఉపసర్పంచి నాగరాజు, నకిరేకల్ పశువైద్యాధికారి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నడిగూడెం: సీజనల్ వ్యాధుల పట్ల జీవాల పెంపకదార్లు అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి డాక్టర్.మాడుపల్లి రవి కుమార్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని పశువైద్యశాలలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవాలకు ఎప్పటికప్పుడు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిల, స్థానిక సర్పంచ్ నూనె నాగన్న, గడ్డం మల్లేష్ యాదవ్, ఎలకా రామిరెడ్డి, గొర్రెల పెంపకందారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎం
కోదాడఅర్బన్: ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు తమ విధి నిర్వహణలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కోదాడ డిపోలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల భద్రతే సంస్థ ప్రధాన విధి అని, ప్రమాద రహిత డ్రైవింగ్ సంస్థకు ప్రధాన ఆధారమని ఆయన అన్నారు. డ్రైవర్లు, సిబ్బంది ఆర్టీసీని ప్రమాదాల బారి నుంచిల కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ సైదులు, మెకానికల్ సూపర్వైజర్ బాలయోగి, ఆర్ఎం కార్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్, కార్మిక సంఘాల నాయకులు కేవీ రత్నం, సుధాకర్‌గౌడ్, సామేలు, సీతయ్య, ప్రసాద్, పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
అంతా గవర్నర్ చూసుకుంటారు...
హైదరాబాద్: తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలన రేపిన ఓటుకు నోటు వ్యవహారం మరింత ముదురుతోంది. తాజాగా చంద్రబాబు, స్టీఫెన్సన్ ల ఆడియో రికార్డులు మరింత అగ్గిని రాజేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం గవర్నర్ నరసింహన్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు సమాచారం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న తాజా పరిణామాలు రెండు రాష్ట్రాలకు మంచివి కాదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. ఈ ఆడియో టేపుల వ్యవహారంపై తాను ఇప్పడేమీ మాట్లాడలేన్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ చూసుకుంటారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుకు వ్యవహారంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ప్రలోభపెట్టినట్టు ఆడియో టేపులు బహిర్గతమై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి-స్టీఫెన్ వీడియో రేపిన ప్రకంపనలతో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎసీబీ అదుపులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎపీ సీంఎంకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది. దీనిలో భాగంగానే ఏసీబీ డీజీ ఏకే ఖాన్ .. సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు విచారణ కోసం ఇవాళో రేపో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.