సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
– పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ
భీమారం (కేతేపల్లి) : వర్షాకాలంలో మూగజీవులకు వచ్చే వ్యాధుల పట్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధకశాఖ జేడీ నర్సింహ సూచించారు. మండలంలోని బీమారం గ్రామంలో ఆదివారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు తాపించేందుకు నిర్వహించిన పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మూగజీవుల్లో రోగ లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్య సిబ్బందిని స్రందించించి చికిత్స చేయించాలన్నారు. ఈ సందర్భంగా 300 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు తాగించినట్లు సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కోట ముత్తయ్య, స్థానిక సర్పంచ్ బడుగుల కవితనరేందర్, ఉపసర్పంచి నాగరాజు, నకిరేకల్ పశువైద్యాధికారి మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.