![సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి](/styles/webp/s3/article_images/2017/09/4/51472237575_625x300.jpg.webp?itok=Jo1VqIZS)
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నడిగూడెం: సీజనల్ వ్యాధుల పట్ల జీవాల పెంపకదార్లు అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి డాక్టర్.మాడుపల్లి రవి కుమార్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని పశువైద్యశాలలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవాలకు ఎప్పటికప్పుడు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అఖిల, స్థానిక సర్పంచ్ నూనె నాగన్న, గడ్డం మల్లేష్ యాదవ్, ఎలకా రామిరెడ్డి, గొర్రెల పెంపకందారులు, సిబ్బంది పాల్గొన్నారు.