
పాండియమ్మాల్, తవమణి(ఫైల్)
చెన్నై : నాలుగో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో ముక్కు పచ్చలారని 4 రోజుల శిశువుకు విషం తినిపించి చంపేశారు తండ్రి, నాన్నమ్మలు. ఈ సంఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధురై జిల్లా సోలవందన్ పంచాయత్ పట్టణానికి చెందిన తవమణి అనే వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. కొద్దిరోజుల క్రితం అతడి భార్య చిత్ర నాలుగో కాన్పులోనూ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన తవమణి, అతడి తల్లి పాండియమ్మాల్‌లు చిన్నారిని పథకం ప్రకారం విషంపెట్టి చంపేశారు. అనంతరం ఊరికి దూరంగా ఉన్న నది దగ్గర పూడ్చేశారు. ( యువకుడి తల నరికి.. కుడి చేతి వేళ్లను..)
చిన్నారి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన వీఏఓ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం చిన్నారి మృతదేహాన్ని సమాధినుంచి వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. రిపోర్టుల్లో చిన్నారి విషప్రయోగం వల్ల చనిపోయినట్లు తేలటంతో. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment